ఇల్లు అద్దెకు కావాలని నగల దోపిడీ | thefts ask to House rent and jewelry robbery | Sakshi
Sakshi News home page

ఇల్లు అద్దెకు కావాలని నగల దోపిడీ

Published Wed, Aug 17 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

thefts ask to House rent and jewelry robbery

 లంగర్‌హౌస్‌: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన దుండగుడు వృద్ధురాలిపై హత్యాయత్నం చేసి.. 8 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంఎ జావీద్‌ కథనం ప్రకారం.. మారుతీనగర్‌లో ఉన్న మూడంతస్తుల భవనంలో భాగ్యమేరీ (63) తన కొడుకు, కోడలితో కలిసి ఉంటోంది. కింది ఫ్లోర్‌లో కొడుకు, పై ఫ్లోర్‌లో వృద్ధురాలు ఉంటున్నారు. ఈమె ఉండే ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్‌ ఖాళీ ఉంది. బుధవారం ఓ వ్యక్తి (40) వచ్చి తనకు ఆ ఫ్లాట్‌ కావాలని భాగ్యమేరీతో అన్నాడు. ఫ్లాట్‌ చూసిన తర్వాత మంచినీళ్లు కావాలన్నాడు.

నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తున్న వృద్ధురాలిపై ఒక్కసారిగా దాడి చేసి కిందపడేసి పిడి గుద్దులు గుద్దాడు. మెడకు వైర్‌ బిగిస్తూ.. బంగారు గొలుసు, చెవి కమ్మలు, చేతికి ఉన్న నాలుగు గాజులు లాక్కొని పారిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన భాగ్యమేరీకి కొద్దిసేపటికి స్పృహ రావడంతో కిందకు వచ్చి తన కోడలికి వి షయం చెప్పింది. సమాచారం అందుకున్న డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌ మొహినుద్దీన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement