న్యూఢిల్లీ: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 1,044 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం వృద్ధితో రూ. 3,168 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 3,016 కోట్ల టర్నోవర్ నమోదైంది. వడ్డీ ఆదాయం 5 శాతం బలపడి రూ. 3,087 కోట్లకు చేరింది. నిర్వహణలోని స్థూల గోల్డ్ లోన్ ఆస్తులు రూ. 54,688 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఫలితాలలో ముత్తూట్ హోమ్‌ఫిన్(ఇండియా), బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తదితర అనుబంధల సంస్థల పనితీరు కలసి ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment