హైదరాబాద్: కూకట్‌పల్లి హైదర్‌నగర్ శాఖలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో శుక్రవారం జరిగిన దోపిడీయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా సినీ ఆర్టిస్టులని తేలింది. హైదర్‌నగర్ శాఖ ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో దోపిడీకి పాల్పడేందుకు శుక్రవారం నలుగురు దుండగులు యత్నించారు.
దోపిడీకి వీలుకాకపోవటంతో వెళ్తూవెళ్తూ ఫైనాన్స్‌లోని సీసీ కెమెరాలను, హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజిలను పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు. శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు, టీవీ నటులని తెలిసింది. వారిని కూకట్‌పల్లి పోలీసులు విచారిస్తున్నారు.