ముత్తూట్ దోపిడీ: ప్రధాన నిందితుడి అరెస్ట్
Published Fri, Aug 11 2017 1:24 PM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM
హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకీ విఫలయత్నం చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ షరీఫ్ అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది నిందితుల్లో ఐదుగురిని పోలీసులు పట్టుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముత్తూట్ చోరీ కోసం మూడు లక్షల రూపాయలను షరీఫ్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అతని వద్ద నుంచి 2 అత్యాధునిక పిస్టల్స్, 4 సెల్ ఫోన్ లు, 15 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement