ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్టు
13 తులాల బంగారు అభరణాలు స్వాధీనం
నిజామాబాద్ సిటీ: డబ్బుల కోసం కుదువపెట్టిన బంగారు అభరణాలను కాజేసిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదులు తెలిపారు. శనివారం నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు ప్రగతినగర్ ముత్తూట్ ఫైనాన్స్‌లో మరవార్ గణేష్‌కుమార్ మేనేజర్‌గా పనిచేసేవాడు.
కాగా నవీపేట్ మండలకేంద్రానికి చెందిన ముత్యం, నిజామాబా ద్ నగరంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, గౌతంనగర్‌కు చెందిన రాకేష్ తమ దగ్గరున్ను 13 తులాల బంగారు అభరణాల(విలువ రూ. 3లక్షల 50 వేలు)ను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈక్రమంలో మేనేజర్ గణేశ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారి లాకర్లను తెరిచి బంగారు ఆభరణాలను తస్కరించా డు. అనంతరం వాటిని పోచమ్మగల్లిలోని మణప్పురం ఫైనా న్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.
అయితే ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీల్లో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ ఇన్‌స్పెక్టర్ బ్రాంచ్‌లో లాకర్లను తనిఖీ చేశారు. దీంతో బం గారు ఆభరణాలు మాయమైన విషయం బయటపడింది. కాగా బ్రాంచ్‌లో లాకర్ల తనిఖీలు జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన గణేష్ తాను కాజేసిన బంగారు అభరణాల విష యం ఎక్కడ బయట పడుతుందోనని బ్రాంచ్‌కు రాకుండా పారిపోయాడు.
అనంతరం బ్రాంచ్‌కు కోటగిరి నవీన్‌కుమార్‌ను ఇన్‌చార్జి మేనేజర్‌గా నియమించారు. గణేష్‌పై ఇన్‌చార్జి మేనేజర్ ఏప్రిల్ 15వ తేదీన నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గణేష్ శనివారం దొరికిపోయాడు. గణేష్ ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో నిందితుడిని పట్టుకుని 13 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.