sidulu
-
నాన్నా.. ఉరేసుకుని చనిపోతున్నా..
పెన్‌పహాడ్: ‘నాన్నా.. బాధలు భరించలేకపోతున్నా.. అందుకే ఉరేసుకుని చనిపోతున్నా’అని తండ్రికి ఫోన్లో చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రూరి జానకిరాములు, జానకమ్మ దంపతుల కుమారుడు సైదులు (41) 2009లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఆయనకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన పార్వతితో వివాహం జరిగింది. వీరికి హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న సాయి భవన్, మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సాయిపూజిత సంతానం. సైదులు ప్రస్తుతం సూర్యాపేటలో ఉద్యోగం చేస్తూ అక్కడే అంజనాపురి కాలనీలో భార్యతో కలసి ఉంటున్నాడు. పది రోజుల క్రితం గొడవ కొంతకాలంగా సైదులు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం గొడవ తారస్థాయికి చేరడంతో పార్వతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్వగ్రామంలోని పొలంవద్దనుంచి తండ్రికి ఫోన్ చేసి ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. జానకిరాములు ఉదయం గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. సమీపంలోని రైతులు వచ్చి సైదులును కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఎస్ఐ వెంకన్నగౌడ్ ఇతర పోలీస్ సిబ్బంది పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. -
టీఆర్ఎస్కు మా సత్తా చూపుతాం
సాక్షి,నేలకొండపల్లి: ఆదర్శ రైతులను తొలిగించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ కర్తవ్యమని ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందగట్ల సైదులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఓటమికి ఆదర్శ రైతులు కృషి చేయనున్నట్లు తెలిపారు. మా సత్తా ఎంటో టీఆర్ఎస్కు చూపుతామని అన్నారు. రాష్ట్రంలో 16,000 మంది ఆదర్శ రైతులను తొలిగించి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని అన్నారు. ఆదర్శ రైతులను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినందున్న సంఘం అంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఏకగీవ్రంగా తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ గెలుపును ఆదర్శ రైతులు భాద్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయుకులు దేవరశెట్టి వెంకటేశ్వర్లు, తేజావత్ శివాజీ, మండల నాయుకులు మక్తాల రామకృష్ణ, దేవరశెట్టి రాము, యర్రా సీతారాములు, తెల్లాకుల అప్పారావు, పెద్దపాక ముత్తయ్య, రాంబ్రహ్మం, తీగ వెంకటనారాయణ, గునగుంట్ల కోటేశ్వరరావు, నోచిన లక్ష్మయ్య, మందడి వెంకటేశ్వర్లు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, కొచ్చెర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్టీరింగ్‌పైనే కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్
నకిరేకల్(నల్గొండ జిల్లా) బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతిచెందాడు. ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును స్లోచేసి రోడ్డుపక్కన ఆపేశాడు. దీంతో బస్సులోని 37 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన నకిరేకల్ బైపాస్‌లో ఆదివారం వేకువజామున 3 గంటలకు చోటుచేసుకుంది. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బయలుదేరింది. డ్రైవర్ జి.సైదులు(45) బస్సు నడుపుతున్నాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. అయినా చలించని డ్రైవర్ బస్సును మెల్లగా రోడ్డుపక్కన ఆపి స్టీరింగ్‌పైనే తలవాల్చి కన్నుమూశాడు. చిమ్మ చీకట్లో బస్సు ఆగడంతో ఏమైందో ఏమో అని ఆందోళనచెందిన ప్రయాణికులు డ్రైవర్ స్టీరింగ్‌పైనే మృతిచెంది ఉండటాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆర్టీసీ అధికారులకు తెలిపి మరో బస్సులో ప్రయాణికులను హైదరాబాద్ తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి
నకిరేకల్: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు నడుపుతూనే మృత్యు ఒడిలోకి జారుకున్న ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ సైదులు గుండెపోటుతో మృతి చెందడంతో.. బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. నకిరేకల్ బైపాస్ వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. -
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్టు
13 తులాల బంగారు అభరణాలు స్వాధీనం నిజామాబాద్ సిటీ: డబ్బుల కోసం కుదువపెట్టిన బంగారు అభరణాలను కాజేసిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదులు తెలిపారు. శనివారం నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు ప్రగతినగర్ ముత్తూట్ ఫైనాన్స్‌లో మరవార్ గణేష్‌కుమార్ మేనేజర్‌గా పనిచేసేవాడు. కాగా నవీపేట్ మండలకేంద్రానికి చెందిన ముత్యం, నిజామాబా ద్ నగరంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, గౌతంనగర్‌కు చెందిన రాకేష్ తమ దగ్గరున్ను 13 తులాల బంగారు అభరణాల(విలువ రూ. 3లక్షల 50 వేలు)ను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈక్రమంలో మేనేజర్ గణేశ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారి లాకర్లను తెరిచి బంగారు ఆభరణాలను తస్కరించా డు. అనంతరం వాటిని పోచమ్మగల్లిలోని మణప్పురం ఫైనా న్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీల్లో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ ఇన్స్పెక్టర్ బ్రాంచ్‌లో లాకర్లను తనిఖీ చేశారు. దీంతో బం గారు ఆభరణాలు మాయమైన విషయం బయటపడింది. కాగా బ్రాంచ్‌లో లాకర్ల తనిఖీలు జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన గణేష్ తాను కాజేసిన బంగారు అభరణాల విష యం ఎక్కడ బయట పడుతుందోనని బ్రాంచ్‌కు రాకుండా పారిపోయాడు. అనంతరం బ్రాంచ్‌కు కోటగిరి నవీన్‌కుమార్‌ను ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. గణేష్‌పై ఇన్చార్జి మేనేజర్ ఏప్రిల్ 15వ తేదీన నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గణేష్ శనివారం దొరికిపోయాడు. గణేష్ ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో నిందితుడిని పట్టుకుని 13 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.