టీఆర్‌ఎస్‌కు మా సత్తా చూపుతాం  | Farmers Decided To Vote For Congress Khammam | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు మా సత్తా చూపుతాం 

Published Fri, Nov 23 2018 5:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Farmers Decided To Vote For Congress Khammam - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సైదులు   

సాక్షి,నేలకొండపల్లి: ఆదర్శ రైతులను తొలిగించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ కర్తవ్యమని ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందగట్ల సైదులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఓటమికి ఆదర్శ రైతులు కృషి చేయనున్నట్లు తెలిపారు. మా సత్తా ఎంటో టీఆర్‌ఎస్‌కు చూపుతామని అన్నారు. రాష్ట్రంలో 16,000 మంది ఆదర్శ రైతులను తొలిగించి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని అన్నారు. ఆదర్శ రైతులను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచినందున్న సంఘం అంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఏకగీవ్రంగా తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు.
టీఆర్‌ఎస్‌ ఓటమి కాంగ్రెస్‌ గెలుపును ఆదర్శ రైతులు భాద్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  సంఘం జిల్లా నాయుకులు దేవరశెట్టి వెంకటేశ్వర్లు, తేజావత్‌ శివాజీ, మండల నాయుకులు మక్తాల రామకృష్ణ, దేవరశెట్టి రాము, యర్రా సీతారాములు, తెల్లాకుల అప్పారావు, పెద్దపాక ముత్తయ్య, రాంబ్రహ్మం, తీగ వెంకటనారాయణ, గునగుంట్ల కోటేశ్వరరావు, నోచిన లక్ష్మయ్య, మందడి వెంకటేశ్వర్లు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, కొచ్చెర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement