farmers committes
-
ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా?
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు ఇచ్చిన ‘కిసాన్ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. బీకేఎస్ డిమాండ్లలో ప్రధానమైనవి.. ► అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండకూడదు ► కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం ► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు ► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం ► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం కాంగ్రెస్ హెచ్చరిక.. దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు.. గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్ గర్ణన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్ రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్ద్ చౌక్, మింటో రోడ్, అజ్మేరి గేట్, ఛమన్‌లాల్ మార్గ్, ఢిల్లీ గేట్ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
కేంద్రం సీరియస్: ఢిల్లీ రణరంగంపై 20మందికి నోటీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మకం కావడం.. పోలీసులపై దాడులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. జాతీయ వేడుక నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రోజు హింసాత్మకంగా మారడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే మొత్తం 25మంది ఎఫ్ఆర్ఐలు నమోదు చేశారు. తాజాగా 20 మందికి నోటీసులు పంపారు. గణతంత్ర రైతు పరేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులపై వివరణ ఇవ్వాలని కోరుతూ మొత్తం 20 మంది రైతు నాయకులకు నోటీసులు పంపించారు. కిసాన్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. నోటీసులు యోగేంద్ర యాదవ్, బాల్దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్‌తో పాటు పలువురు ఉన్నారు. మూడు రోజులైనా ఢిల్లీలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పోలీసులు పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. రైతులు రెచ్చిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసులు పంపిన వాటిపై రైతు ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో.. ఏమని సమాధానమిస్తారో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి రైతులతో పాటు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తోంది. ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేయడంతో పాటు విధ్వంసం సృష్టికి కారకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
రైతు పోరు: పంజాబ్, హర్యానాల్లో హై అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో పరిసర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న హర్యానా, పంజాబ్‌లు హై అలర్ట్ ప్రకటించాయి. సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీస్‌లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనూహ్యంగా రైతుల పరేడ్ విజయవంతం కావడంతోపాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో ఢిల్లీలో ఏం జరుగుతోందనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లే అన్ని రహదారులు, మెట్రోస్టేషన్లు మూసివేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి అదనంగా పారామిలటరీ బలగాలను పెంచారు. ఇంటర్నెట్, మెట్రో సేవలను నిలిపివేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. రైతుల పరేడ్‌కు కేంద్రంగా నిలిచిన ఎర్రకోట, జమా మసీద్ వద్ద పోలీసులు భద్రత పటిష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు తీసుకున్నారు. కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొనసాగుతోంది. దర్యాప్తు మొదలు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల దీక్షా శిబిరాల వద్ద భద్రత పెంచారు. అయితే నిన్నటి ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ఘటనలపై చర్యలు మొదలుపెట్టారు. నిన్న జరిగిన ఘర్షణల్లో 153 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పోలీసులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. నిన్నటి ఆందోళనలపై మొత్తం 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు గణతంత్ర పరేడ్‌పై స్పెషల్ సెల్ విచారణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా గ్యాంగ్స్టర్ల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘాజీపూర్మార్కెట్ నుంచి ఢిల్లీ వచ్చే రహదారి మూసివేశారు. ఇది ఇలా ఉండగా రైతుల గణతంత్ర పరేడ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు వేరే శక్తులు కారణమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయని.. రైతులెవరూ అలాంటి పరిణామాలకు అంగీకరించరని.. సహకరించరని గుర్తుచేశారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
నేడు గణతంత్రం.. ఢిల్లీలో రైతుల రణరంగం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిర్విరామంగా చేస్తున్న రైతుల పోరాటం గణతంత్ర దినోత్సవం రోజు తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల పరేడ్‌కు సుప్రీంకోర్టు సూచనతో పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే మంగళవారం పరేడ్ చేపట్టడానికి రైతులు వెళ్తుండగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టేందుకు ఢిల్లీ సరిహద్దుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రైతులను అడ్డగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. టిక్రీ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో రైతులు వస్తుండడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రోడ్డుకు అడ్డుగా పెట్టిన కంటెయినర్లను రైతులు ట్రాక్టర్లతో నెట్టివేశారు. ఘాజీపూర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. ఇక రైతుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు ఉండడంతో పరిస్థితి చేయి దాటి పోతుందనేలా ఉంది. సంజయ్‌గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ వద్ద ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులపై టియర్ గ్యాస్‌ను పోలీసులు ప్రయోగించారు. రైతులను నిలువరించేందుకు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించి వారిని అడ్డగించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ క్యానన్ల వాహనాలపైకి ఎక్కి రైతులు నినాదాలు చేస్తున్నారు. రైతుల పోరాటం మంగళవారంతో 62 రోజులకు చేరింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గణతంత్ర వేళ అటు సంబరాలు.. ఇటు నిరసనలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా చేసుకునే సంబరాలే గణతంత్ర వేడుకలు. ఒకపక్కన దేశమంతటా 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మంగళవారం నేత్రపర్వంగా సాగుతుంటే.. మరోవైపు రైతులు జాతీయ జెండాలు పట్టుకుని నిరసన బాట పట్టారు. నాగలితో పాటు జాతీయ జెండా చేత పట్టి ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలు జరుగుతుండగా... అదే ఢిల్లీ శివారులో లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ విధంగా జాతీయ పండుగ రోజు ఒకవైపు సంబరాలు.. మరోవైపు నిరసనలు కొనసాగడం విశేషం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనగా.. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపడుతున్నారు. వారు నిర్విరామంగా 62 రోజులుగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపిస్తున్నా మెట్టు దిగకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో గణతంత్ర వేడుకను తమ ఉద్యమానికి వినియోగించుకుని దేశభక్తిని చాటుతూనే నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రాల్లో కూడా రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. అయితే రైతుల భారీ ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపు 10 విడతలు చర్చలు చేసినా ఎలాంటి ఫలితం లేదు. చర్చలకు పిలుస్తారు.. రైతులకు అడిగిన వాటికి కుదరదని తేల్చి చెప్పేస్తారు. దీంతో పదిమార్లు విడతలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విషయంలో రైతులు ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు ఇంకోటి అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో చివరకు కేంద్రం ఒక మెట్టు దిగి సుప్రీంకోర్టు సలహా ప్రకారం ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల రద్దును వాయిదా వేస్తామని ప్రకటించింది. దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పగా రైతులు అంగీకరించలేదు. తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని ఆపేందుకు కేంద్రం ఈ ప్రతిపాదన చేసిందని.. తక్షణమే ఆ చట్టాలను రద్దు చేస్తేనే కానీ తాము ఆందోళనలు విరమించమని తేల్చి చెబుతున్నారు. రైతుల పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంగా కొందరు అభివర్ణిస్తున్నారు. రైతుల పోరాటంలో గణతంత్ర దినోత్సవం రోజుకు తీవ్ర రూపం దాల్చింది. మునుపెన్నడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతు భరోసా కేంద్రాల్లో 14 రకాల సేవలు
-
అన్నదాతకు అండగా..
-
రైతాంగాన్ని ఆదుకునేలా వైఎస్ జగన్ నిర్ణయాలు
-
పరకాల మం. లక్ష్మీపురంలో ఉద్రిక్తత
-
రైతులు బాబు ట్రాప్‌లో పడొద్దు
-
రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో విట్యాల రైతుల అవస్థలు
-
అన్నదాతల బ్యాలెట్ పోరు
సాక్షి, హైదరాబాద్: గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు బ్యాలెట్ పోరాటానికి సిద్ధమయ్యారు. రోడ్డెక్కి పోరాడినా, ధర్నాలు చేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇక బ్యాలెట్ పోరుతోనైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు సోమవారం నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 500 నుంచి వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించటం గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల అంశంపై తీర్మానాలు చేశారు. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, కొన్నిచోట్ల కుల సంఘాలు ఏకమై తీర్మానాలు చేశాయి. చిన్న గ్రామమైతే 2 నుంచి 5 నామినేషన్లు, పెద్ద గ్రామాలైతే 5 నుంచి 10 చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. నామినేషన్‌కు ఆవసరమయ్యే డిపాజిట్, ఇతర ఖర్చులను కూడా గ్రామ కమిటీలు, రైతు సంఘాలే భరించాలని కూడా తీర్మానించారు. ఫ్లోరైడ్ బాధితులు గతంలో నల్లగొండ లోక్‌సభకు 184 నామినేషన్లు దాఖలు చేసిన సంఘటన స్ఫూర్తిగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2014 ఎన్నికల సమయంలో కూడా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 27 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. గిట్టుబాటు ధరే లక్ష్యంగా... పసుపు, ఎర్రజొన్నలు సాగు చేసిన రైతులకు దశాబ్దాల కాలంగా గిట్టుబాటు ధర లభించటంలేదు. కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటించటం లేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల ముట్టడి, వంటా వార్పు... ఇలా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.8,500, పసుపు క్వింటాలుకు రూ. 15 వేల చొప్పున మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి డిమాండ్లు నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో పసుపు, ఎర్రజొన్న రైతులంతా ఏకమై ప్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే లక్ష్యంతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. -
గవర్నర్ ప్రసంగంపై మండిపడుతున్న రాజధాని రైతులు
-
టీఆర్ఎస్కు మా సత్తా చూపుతాం
సాక్షి,నేలకొండపల్లి: ఆదర్శ రైతులను తొలిగించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ కర్తవ్యమని ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందగట్ల సైదులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఓటమికి ఆదర్శ రైతులు కృషి చేయనున్నట్లు తెలిపారు. మా సత్తా ఎంటో టీఆర్ఎస్కు చూపుతామని అన్నారు. రాష్ట్రంలో 16,000 మంది ఆదర్శ రైతులను తొలిగించి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని అన్నారు. ఆదర్శ రైతులను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినందున్న సంఘం అంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఏకగీవ్రంగా తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ గెలుపును ఆదర్శ రైతులు భాద్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయుకులు దేవరశెట్టి వెంకటేశ్వర్లు, తేజావత్ శివాజీ, మండల నాయుకులు మక్తాల రామకృష్ణ, దేవరశెట్టి రాము, యర్రా సీతారాములు, తెల్లాకుల అప్పారావు, పెద్దపాక ముత్తయ్య, రాంబ్రహ్మం, తీగ వెంకటనారాయణ, గునగుంట్ల కోటేశ్వరరావు, నోచిన లక్ష్మయ్య, మందడి వెంకటేశ్వర్లు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, కొచ్చెర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘భూసేకరణ’పై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తాజాగా జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్స్-2015 చట్టబద్ధతను సవాల్‌చేస్తూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. పార్లమెంటులో అనుసరించాల్సిన శాసన ప్రక్రియ నుంచి తప్పించుకుంటూ దొడ్డిదారిన తిరిగి భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ సమాజ్, చోగామా వికాస్ ఆవం తమ పిటిషన్లో ఆరోపించాయి. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్లే లోక్‌సభలో ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా తిరిగి ఆర్డినెన్స్ జారీ చేసిందని రైతు సంఘాలు పేర్కొన్నాయి.