స్టీరింగ్‌పైనే కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్
నకిరేకల్(నల్గొండ జిల్లా)
బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతిచెందాడు. ఒక‍్కసారిగా ఛాతీనొప్పి రావడంతో అప్రమత‍్తమైన డ్రైవర్ బస‍్సును స్లోచేసి రోడ్డుపక‍్కన ఆపేశాడు. దీంతో బస్సులోని 37 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన నకిరేకల్ బైపాస్‌లో ఆదివారం వేకువజామున 3 గంటలకు చోటుచేసుకుంది.
ఖమ‍్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బయలుదేరింది. డ్రైవర్ జి.సైదులు(45) బస్సు నడుపుతున్నాడు. మార‍్గమధ‍్యంలో ఒక‍్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. అయినా చలించని డ్రైవర్ బస్సును మెల‍్లగా రోడ్డుపక‍్కన ఆపి స్టీరింగ్‌పైనే తలవాల్చి కన‍్నుమూశాడు. చిమ‍్మ చీకట‍్లో బస్సు ఆగడంతో ఏమైందో ఏమో అని ఆందోళనచెందిన ప్రయాణికులు డ్రైవర్ స్టీరింగ్‌పైనే మృతిచెంది ఉండటాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆర్టీసీ అధికారులకు తెలిపి మరో బస్సులో ప్రయాణికులను హైదరాబాద్ తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.