ganesh kumar
-
వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం
-
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - యామిని బాల , వాసుపల్లి గణేష్ కుమార్
-
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
-
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం వెలుగుచూసింది. ప్లస్ టు ఫలితాలు విడుదలైన రోజు నుంచి టాపర్‌గా నిలిచిన గణేష్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల వయసులో గణేష్ కుమార్ ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాపర్స్ స్కామ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. తన కూతురు టాపర్‌గా నిలవాలని ఆశపడి అడ్డదారి తొక్కినందుకు గతేడాది బిహార్ ప్లస్ టూ టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో గతంలోనే అరెస్ట్ చేసి విచారించారు. బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని, వంటలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చునని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పినట్లు బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ స్వయంగా అంగీకరించారు. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాలని చెప్పగా.. టాపర్ రుబీ రాయ్ మాత్రం 'తులసీదాస్ జీ ప్రణామ్' అంటూ కేవలం రెండు పదాలతో వ్యాసం ముగించిడం గమనార్హం. తాజాగా బిహార్ ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంతో గతేడాది తరహాలోనే మరో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేసి టోకరా వేస్తున్న మోసగాడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన నాలుగు నెలల్లో అనేక మంది ఇతడి బారిన పడినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రం శివప్రసాద్ అలియాస్ గణేష్ కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. నాలుగు నెలల క్రితం వికాస్‌నగర్‌లో స్పీడ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పరుతో రూ.1000 వసూలు చేసే వాడు. కొన్ని టెక్టŠస్ బుక్స్‌లో ఉన్న అంశాలను చేతిరాత ద్వారా పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) తిరగరాయాలని, ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామంటూ నమ్మబలికే వాడు. ప్రాజెక్టు ఇచ్చే సమయంలోనే అడ్డదిడ్డమైన నిబంధనలు విధించే శివప్రసాద్ చివరకు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని తిరస్కరిస్తూ టోకరా వేసేవాడు. ఇటీవల ఎస్సార్‌నగర్ ప్రాంతానికి చెందిన మాయావతి పత్రికలో ప్రకటన చూసి శివప్రసాద్‌ను సంప్రదించారు. ఆమె నుంచి రూ.వెయ్యి వసూలు చేసిన నిందితులు ఓ ప్రాజెక్టు ఇచ్చాడు. అతికష్టమ్మీద ఆమె దాన్ని పూర్తి చేసినప్పటికీ చేతి రాతతో రాసిన దాంట్లో 50 తప్పులు ఉన్నాయంటూ తిరస్కరించి నగదు చెల్లించకుండా మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్ స్పెక్టర్ జి.శంకర్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. మంగళవారం నిందితుడైన శివప్రసాద్‌ను అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుంది. -
అనూష కేసులో వాసుపల్లినీ నిందితుడిగా చేర్చాలి
ఈ కేసులో ఎన్నో అనుమానాలు నిందితునికి ఎంఎల్ఎ వత్తాసు విషయాలు దాస్తున్న పోలీసులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ధ్వజం డాబాగార్డెన్స్(విశాఖ):నగరంలో కలకలం రేపిన అనూ ష హత్య కే సులో ఆరోపణలు ఎదుర్కొం టున్న సూరాడ ఎల్లాజీతోపాటు అతనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 24న అనూష తప్పిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని కొందరు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు ఆరోపిస్తున్న పలు అనుమానా లు కలుగుతున్నాయన్నారు. ప్రధాన నింది తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 29వ వా ర్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ పత్తా లేకుండా పోయారన్నారు. మీడియాకు కూడా కనబడకుండా తిరుగుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. ఆ వార్డు టీడీపీ నా యకు లు కూడా అనూషది హత్యేనని ఆరోపిస్తుంటే వారిని ఎమ్మెల్యే వాసుపల్లి బెదిరించడమే గాక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పాదమన్నారు. నిజాన్ని బయటకు చెబితే సస్పెండ్ చే యడం ఎమ్మెల్యేకే చెందిందన్నారు. ఎమ్మె ల్యే వాసుపల్లి ఎంతకైనా తెగించి ఎవరూ కూడా ఎల్లాజీ కోసం బయట ఎక్కడ కూడా మాట్లాడొద్దని సూచించడం తెలుగుదేశం పార్టీకే సిగ్గుచేటన్నారు. హత్య చేసిన నేరస్తులు, దగాకోరుల ను ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నారని చెప్పారు. ఇం త జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గవద్దని నగర పోలీస్ కమిషనర్‌ను ఆయన కోరారు. కేసులో అన్ని గోప్యంగా ఉంచుతుంటే అనూషను కిరాతకంగా హతమర్చినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోటు కేసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా ఎలా బుక్ అయ్యారో..అనూష హత్య కేసులో ఎమ్మె ల్యే కూడా బుక్ అయినట్టేనని తెలిపారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మైనార్టీ విభాగ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్, బీసీ నాయకుడు పక్కి దివాకర్ పాల్గొన్నారు. -
ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు
తిరువనంతపురం: ఏనుగును నిర్బంధించిన కేసులో కేరళ మాజీ మంత్రి, నటుడు కేబీ గణేష్ కుమార్‌కు విజిలెన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం గణేష్ అటవీ శాఖ నుంచి ఓ ఏనుగును కొనుగోలు చేశారు. కావిలమ్మ భగవతీ దేవస్థానానికి కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు ఏనుగును దేవాలయానికి అప్పగించాలి. అయితే గణేష్ ఏనుగును దేవాలయానికి అప్పగించకుండా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఏనుగును ఆదాయవనరుగా మార్చుకుని పండగల పూట అద్దెకు ఇచ్చేవాడని గణేష్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై జంతు హక్కుల సంఘాలు కూడా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఫిర్యాదు చేశాయి. -
ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్
► కంపెనీ మారినానంబరు మారదు ►పీఎఫ్ ఖాతాలేకపోతే ఫిర్యాదులు చేయండి ►పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్ పటాన్చెరు: ఇక నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ పర్మినెంట్‌గా ఒకే నంబర్ (యూనిక్)ను కేటాయిస్తున్నామని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి ఖాతాదారులెవరూ కంపెనీలు మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదన్నారు. తమ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 1,88,327 మంది ఖాతాదారులందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను కేటాయించామన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ పీఎఫ్ ఖాతా నంబర్ తెలియని వారు వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని అడిగి నంబర్ తెలుకుకోవాలన్నారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల పీఎఫ్ నంబర్లను వారికి తెలపాలన్నారు. ఓ వ్యక్తి పేరు మీద పీఎఫ్ సొమ్ము నెలవారీగా అందితే అతనికి నిర్ణీత నంబర్ (పన్నెండకెల సంఖ్య)ను కేటాయించామని స్పష్టం చేశారు. గతంలో కాకుండా పీఎఫ్ క్లెయిమ్‌లను కూడా త్వరితగతిన చేపడుతున్నామన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కటింగ్ చేసి సదరు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సొమ్ము జమచేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలు పీఎఫ్‌లు కట్టని సంస్థలు 300 ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాతాదారులందరూ ఆధార్ ఇవ్వాల్సిందే పీఎఫ్ ఖాతాదారులందరూ తమకు కేటాయించిన యూనిక్ నంబర్‌తో తమ ఆధార్ కార్డు నంబర్‌ను జత చేయాలన్నారు. అలాగే ఖాతాదారులందరూ తమ బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ సమర్పించాలన్నారు. ఖాతాదారులందరూ తమ సంస్థల ద్వారానే వివరాలను పీఎఫ్ కార్యాలయానికి పంపాలన్నారు. ఇక నుంచి క్లెయిమ్ పరిష్కారం తర్వాత పీఎఫ్ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఫిర్యాదు చేయండి పీఎఫ్ సమస్యలపై ఎవరైనా సరే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గ ణేష్‌కుమార్ సూచించారు. కాంట్రాక్టర్ చేసే మోసాలు, లేదా యా జమాన్యం చేస్తున్న మోసాలపై ఎప్పటికప్పుడు తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉద్యోగుల పేరిట పీఎఫ్ ఖాతా తెరవని సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులెవరైనా టటౌ.ఞ్చ్ట్ట్చఛిజ్ఛిటఠః ్ఛఞజజీఛీజ్చీ.జౌఠి.జీ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీన భవిష్యనిధి అదాలత్‌లో కూడా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. పీఎఫ్ పెన్షన్ రూ.1000 ఫీఎఫ్ ఖాతాదారులకు కనీసంగా రూ. వెయ్యి పింఛన్ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. 2014 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఖాతాదారులకు పెరిగిన పింఛన్ ఇవ్వడం లేదన్నారు. అక్టోబర్ నెల నుంచి పెంచిన పింఛన్ ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం బకాయిలన్నింటినీ విడుదల చేస్తామన్నారు. ఖాతాదారుల పింఛన్ స్థాయిని బట్టి పింఛన్ పెరుగుతుందన్నారు. కానీ కనీస పింఛన్ మాత్రం రూ.వెయ్యి ఉంటుందన్నారు. -
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్టు
13 తులాల బంగారు అభరణాలు స్వాధీనం నిజామాబాద్ సిటీ: డబ్బుల కోసం కుదువపెట్టిన బంగారు అభరణాలను కాజేసిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదులు తెలిపారు. శనివారం నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు ప్రగతినగర్ ముత్తూట్ ఫైనాన్స్‌లో మరవార్ గణేష్‌కుమార్ మేనేజర్‌గా పనిచేసేవాడు. కాగా నవీపేట్ మండలకేంద్రానికి చెందిన ముత్యం, నిజామాబా ద్ నగరంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, గౌతంనగర్‌కు చెందిన రాకేష్ తమ దగ్గరున్ను 13 తులాల బంగారు అభరణాల(విలువ రూ. 3లక్షల 50 వేలు)ను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈక్రమంలో మేనేజర్ గణేశ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారి లాకర్లను తెరిచి బంగారు ఆభరణాలను తస్కరించా డు. అనంతరం వాటిని పోచమ్మగల్లిలోని మణప్పురం ఫైనా న్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీల్లో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ ఇన్స్పెక్టర్ బ్రాంచ్‌లో లాకర్లను తనిఖీ చేశారు. దీంతో బం గారు ఆభరణాలు మాయమైన విషయం బయటపడింది. కాగా బ్రాంచ్‌లో లాకర్ల తనిఖీలు జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన గణేష్ తాను కాజేసిన బంగారు అభరణాల విష యం ఎక్కడ బయట పడుతుందోనని బ్రాంచ్‌కు రాకుండా పారిపోయాడు. అనంతరం బ్రాంచ్‌కు కోటగిరి నవీన్‌కుమార్‌ను ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. గణేష్‌పై ఇన్చార్జి మేనేజర్ ఏప్రిల్ 15వ తేదీన నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గణేష్ శనివారం దొరికిపోయాడు. గణేష్ ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో నిందితుడిని పట్టుకుని 13 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.