
ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు
తిరువనంతపురం: ఏనుగును నిర్బంధించిన కేసులో కేరళ మాజీ మంత్రి, నటుడు కేబీ గణేష్ కుమార్కు విజిలెన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
20 ఏళ్ల క్రితం గణేష్ అటవీ శాఖ నుంచి ఓ ఏనుగును కొనుగోలు చేశారు. కావిలమ్మ భగవతీ దేవస్థానానికి కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు ఏనుగును దేవాలయానికి అప్పగించాలి. అయితే గణేష్ ఏనుగును దేవాలయానికి అప్పగించకుండా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఏనుగును ఆదాయవనరుగా మార్చుకుని పండగల పూట అద్దెకు ఇచ్చేవాడని గణేష్పై ఫిర్యాదు చేశారు. దీనిపై జంతు హక్కుల సంఘాలు కూడా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఫిర్యాదు చేశాయి.