Former Kerala minister
-
పోరాటంతోనే సామాజిక న్యాయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పోరాటాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హెచ్‌సియూలో గెలిచిన విద్యార్థి నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలు అస్థవ్యస్తంగా మారాయని, కుల వివక్ష పెరిగిపోతుందన్నారు.హెచ్‌సియూలో మతచాందస వాదం కారణంగానే రోహిత్ వేముల మరణించారన్నారు.హెచ్‌సియూలో గెలుపు అందరికీ ఆదర్శం కావాలని, విద్యార్ధుల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలునిచ్చారు. అనంతరం హెచ్‌సియూ అధ్యక్షులుగా గెలుపొందిన కులదీప్‌సింగ్, ఉపాధ్యక్షులు సుందర్, ప్రధాన కార్యదర్శి సుమన్ దామెర, జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, తుషారలను సన్మానించారు. కార్యక్రమంలో కోట శ్రీనివాస్, సాంబశివ, నాగేశ్వర్రావు, జావేద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు
తిరువనంతపురం: ఏనుగును నిర్బంధించిన కేసులో కేరళ మాజీ మంత్రి, నటుడు కేబీ గణేష్ కుమార్‌కు విజిలెన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం గణేష్ అటవీ శాఖ నుంచి ఓ ఏనుగును కొనుగోలు చేశారు. కావిలమ్మ భగవతీ దేవస్థానానికి కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు ఏనుగును దేవాలయానికి అప్పగించాలి. అయితే గణేష్ ఏనుగును దేవాలయానికి అప్పగించకుండా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఏనుగును ఆదాయవనరుగా మార్చుకుని పండగల పూట అద్దెకు ఇచ్చేవాడని గణేష్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై జంతు హక్కుల సంఘాలు కూడా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఫిర్యాదు చేశాయి.