పోరాటంతోనే సామాజిక న్యాయం
పోరాటంతోనే సామాజిక న్యాయం
Published Mon, Oct 3 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పోరాటాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హెచ్‌సియూలో గెలిచిన విద్యార్థి నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలు అస్థవ్యస్తంగా మారాయని, కుల వివక్ష పెరిగిపోతుందన్నారు.హెచ్‌సియూలో మతచాందస వాదం కారణంగానే రోహిత్ వేముల మరణించారన్నారు.హెచ్‌సియూలో గెలుపు అందరికీ ఆదర్శం కావాలని, విద్యార్ధుల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలునిచ్చారు. అనంతరం హెచ్‌సియూ అధ్యక్షులుగా గెలుపొందిన కులదీప్‌సింగ్, ఉపాధ్యక్షులు సుందర్, ప్రధాన కార్యదర్శి సుమన్ దామెర, జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, తుషారలను సన్మానించారు. కార్యక్రమంలో కోట శ్రీనివాస్, సాంబశివ, నాగేశ్వర్‌రావు, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement