అనూష కేసులో వాసుపల్లినీ నిందితుడిగా చేర్చాలి
ఈ కేసులో ఎన్నో అనుమానాలు
నిందితునికి ఎంఎల్‌ఎ వత్తాసు
విషయాలు దాస్తున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ధ్వజం
డాబాగార్డెన్స్(విశాఖ):నగరంలో కలకలం రేపిన అనూ ష హత్య కే సులో ఆరోపణలు ఎదుర్కొం టున్న సూరాడ ఎల్లాజీతోపాటు అతనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 24న అనూష తప్పిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని కొందరు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు ఆరోపిస్తున్న పలు అనుమానా లు కలుగుతున్నాయన్నారు. ప్రధాన నింది తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 29వ వా ర్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ పత్తా లేకుండా పోయారన్నారు.
మీడియాకు కూడా కనబడకుండా తిరుగుతున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఆ వార్డు టీడీపీ నా యకు లు కూడా అనూషది హత్యేనని ఆరోపిస్తుంటే వారిని ఎమ్మెల్యే వాసుపల్లి బెదిరించడమే గాక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పాదమన్నారు. నిజాన్ని బయటకు చెబితే సస్పెండ్ చే యడం ఎమ్మెల్యేకే చెందిందన్నారు. ఎమ్మె ల్యే వాసుపల్లి ఎంతకైనా తెగించి ఎవరూ కూడా ఎల్లాజీ కోసం బయట ఎక్కడ కూడా మాట్లాడొద్దని సూచించడం తెలుగుదేశం పార్టీకే సిగ్గుచేటన్నారు.
హత్య చేసిన నేరస్తులు, దగాకోరుల ను ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నారని చెప్పారు. ఇం త జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గవద్దని నగర పోలీస్ కమిషనర్‌ను ఆయన కోరారు. కేసులో అన్ని గోప్యంగా ఉంచుతుంటే అనూషను కిరాతకంగా హతమర్చినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోటు కేసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా ఎలా బుక్ అయ్యారో..అనూష హత్య కేసులో ఎమ్మె ల్యే కూడా బుక్ అయినట్టేనని తెలిపారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మైనార్టీ విభాగ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్, బీసీ నాయకుడు పక్కి దివాకర్ పాల్గొన్నారు.