Anusha murder
-
‘అనూష’ కుటుంబానికి రూ.10 లక్షలు: సీఎం జగన్
అమరావతి: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన యువతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తి చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. కుటుంబానికి రూ.10 లక్షలు అందించి కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య -
కట్టుకోబోయే వాడే కడతేర్చాడు
నాగోలు: కాబోయే భార్యను అనుమానంతోనే అంతం చేశాడు. నగరంలో సంచలనం రేపిన అనూష హత్య కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశాడు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజానగర్ తండాకు చెందిన అనూష (23) బీటెక్ పూర్తి చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం నగరంలో శిక్షణ తీసుకుంటూ హయత్‌నగర్‌లోని తన సోదరి వద్ద ఉంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి తండాకు చెందిన అంగోత్ మోతీలాల్ (24) అనూషకు దూరపు బంధువు. బీటెక్ పూర్తి చేసి శంషాబాద్‌లోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో టెలీకాలర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2013 నుంచి అనుష, మోతీలాల్‌లు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో ఇరు వర్గాలు ఒప్పుకుని నిశ్చితార్ధం చేశారు. కట్నం కింద 8 లక్షల నగదు ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే అనూష కానిస్టేబుల్ శిక్షణ కోసం నగరానికి వెళ్లడం, ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన మోతీలాల్ ఆమె ఫోన్, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించాడు. ఇంతలోనే అనూష తాను గర్భవతిని అని, పెళ్లి చేసుకోవాలని మోతీలాల్పై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మోతీలాల్ ఇంటర్వ్యూ ఉందని గ్రామంలో ఉన్న అనూషను ఈ నెల 24న నగరానికి తీసుకొచ్చాడు. హయత్‌నగర్ పరిసర ప్రాంతాలలో తిరిగి మిధాని కాలనీలో నివాసముండే అనూష సోదరి చిట్టెమ్మ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 28వ తేదీన మోతీలాల్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనూషపై అనుమానం పెంచుకున్న మోతీలాల్ గర్భం, వివాహం విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన మోతీలాల్ బండరాయితో అనూషపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అనూష అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు ఇంటికి రాకపోగా, ఇద్దరి ఫోన్లు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో నగరంలో ఉండే సోదరుడు శ్రీకాంత్‌కు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఇంటికి వెళ్లి పరిశీలించగా అనూష రక్తపుమడుగులో కనిపించింది. దీంతో శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు మోతీలాల్‌ను శనివారం సాగర్‌రింగురోడ్డులోని టీకేఆర్ కమాన్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ రవిందర్‌రెడ్డి, హయత్‌నగర్ సీఐ సతీష్, జి.రామన్‌గౌడ్, పాల్గొన్నారు. ఎస్ఐ రాంలాల్ ప్రోద్బలంతోనే హత్య.. మోతీలాల్ సోదరుడు రాంలాల్ నగరంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడని, అతని మరదలిని మోతీ లాల్‌కు ఇవ్వడం కోసమే తన కూతురిని హత్య చేయిం చాడని అనూష తల్లిదండ్రులు డీసీపీ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక రాంలాల్, శంకర్, చిన్నాల హస్తం ఉందని వాపోయారు. -
అనూష కేసులో వాసుపల్లినీ నిందితుడిగా చేర్చాలి
ఈ కేసులో ఎన్నో అనుమానాలు నిందితునికి ఎంఎల్ఎ వత్తాసు విషయాలు దాస్తున్న పోలీసులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ధ్వజం డాబాగార్డెన్స్(విశాఖ):నగరంలో కలకలం రేపిన అనూ ష హత్య కే సులో ఆరోపణలు ఎదుర్కొం టున్న సూరాడ ఎల్లాజీతోపాటు అతనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 24న అనూష తప్పిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని కొందరు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు ఆరోపిస్తున్న పలు అనుమానా లు కలుగుతున్నాయన్నారు. ప్రధాన నింది తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 29వ వా ర్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ పత్తా లేకుండా పోయారన్నారు. మీడియాకు కూడా కనబడకుండా తిరుగుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. ఆ వార్డు టీడీపీ నా యకు లు కూడా అనూషది హత్యేనని ఆరోపిస్తుంటే వారిని ఎమ్మెల్యే వాసుపల్లి బెదిరించడమే గాక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పాదమన్నారు. నిజాన్ని బయటకు చెబితే సస్పెండ్ చే యడం ఎమ్మెల్యేకే చెందిందన్నారు. ఎమ్మె ల్యే వాసుపల్లి ఎంతకైనా తెగించి ఎవరూ కూడా ఎల్లాజీ కోసం బయట ఎక్కడ కూడా మాట్లాడొద్దని సూచించడం తెలుగుదేశం పార్టీకే సిగ్గుచేటన్నారు. హత్య చేసిన నేరస్తులు, దగాకోరుల ను ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నారని చెప్పారు. ఇం త జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గవద్దని నగర పోలీస్ కమిషనర్‌ను ఆయన కోరారు. కేసులో అన్ని గోప్యంగా ఉంచుతుంటే అనూషను కిరాతకంగా హతమర్చినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోటు కేసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా ఎలా బుక్ అయ్యారో..అనూష హత్య కేసులో ఎమ్మె ల్యే కూడా బుక్ అయినట్టేనని తెలిపారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మైనార్టీ విభాగ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్, బీసీ నాయకుడు పక్కి దివాకర్ పాల్గొన్నారు.