
అమరావతి: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన యువతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం ఆరా తీశారు.
సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తి చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. కుటుంబానికి రూ.10 లక్షలు అందించి కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment