narasarao peta
-
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్‌కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్‌లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. -
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
కేసానుపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ
నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కేసానుపల్లిలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడికి యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించిన పంచాయతీ కార్యదర్శిపై బెదిరింపులకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. రెండురోజుల కిందట గ్రామంలోని మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు గ్రామంలో బెదిరింపులకు దిగారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి తన సిబ్బందికి సూచించారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా టీడీపీ వర్గీయులు వచ్చి.. తాము ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని తొలగిస్తే చేతులు నరికేస్తామంటూ వీరంగం వేశారు. గ్రామ సచివాలయం వద్ద వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ బాలనాగిరెడ్డి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను పంపించి వేశారు. ఫ్లెక్సీలను పోలీసులు తొలగించి.. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన వర్గీయుల దాడి
నరసరావుపేట రూరల్(గుంటూరు జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వలేదనే కారణంతో వైఎస్సార్సీపీకి చెందిన వారిపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు చేసిన దాడిలో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పమిడిపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం బొడ్డురాయి సెంటర్లో చోటుచేసుకుంది. గాయపడిన వారందరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ముతరాసులు నివాసం ఉండే వార్డులో వైఎస్సార్సీపీ గెలుపొందింది. దీనిని మనసులో పెట్టుకున్న టీడీపీ, జనసేన వర్గీయులు బొడ్డురాయి సెంటర్లో ముతరాసులు కూర్చుని ఉండగా ముందస్తు ప్రణాళికతో సుమారు 30 మంది మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో బొంగితాల శ్రీను, రవి, బాజి, లక్ష్మీనారాయణ, రామారావులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన రవి, రామారావులను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడులు జరిగాయని, ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా మద్దతు పొందలేని పారీ్టలు ఇటువంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుంటాయని విమర్శించారు. ఎమ్మెల్యే వెంటమార్కెట్ యార్డు చైర్మన్ ఎస్.హనీఫ్ తదితరగ్రామ నాయకులు ఉన్నారు. డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ వై.అచ్చయ్య ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అనూష’ కుటుంబానికి రూ.10 లక్షలు: సీఎం జగన్
అమరావతి: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన యువతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తి చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. కుటుంబానికి రూ.10 లక్షలు అందించి కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య -
కలెక్టర్‌పై వైద్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో కరోనా వైరస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్, వైద్యుడు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అధికారులు సరైన విధంగా విధులు నిర్వర్తించడంలేదని మందలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ తీరుపై నాదెండ్ల ప్రభుత్వ వైద్యుడు సోములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తనకు చెప్పందేకు నువ్వెవరివంటూ విధుల్లో ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించాడు. డాక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులను అదేశించారు. -
సీ–19 రక్ష యాప్‌కు ఆదరణ
సాక్షి, అమరావతి: నరసరావుపేట యువకుడు గాయం భరత్‌కుమార్‌రెడ్డి రూపొందించిన కోవిడ్–19 లక్షణాలను ట్రాక్ చేసే వెబ్ అప్లికేషన్ (యాప్)కు ఆదరణ లభిస్తోంది. గుంటూరులో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటుగా ‘సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ’ నిర్వహిస్తున్న భరత్ లాక్డౌన్ నేపథ్యంలో నరసరావుపేటకు వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కలవరపాటుగా మారిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేలా ఒక యాప్‌ను రూపొందించాలనే ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం తాను రూపొందించిన ‘సీ19–రక్ష’ యాప్‌ను ఇప్పటి వరకు 27,500 మంది ఉపయోగించుకున్నట్టు సాక్షికి తెలిపాడు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించాడు. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన "www.c19raksha.in' వెబ్ అప్లికేషన్ ఇది. ఇంట్లో కూర్చొని కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకుని కేవలం రెండు నిమిషాల్లో మన పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. ► ఇందులో కరోనా వ్యాధికి సంబంధించిన సింప్టమాటిక్, అసింప్ట్టమాటిక్ లక్షణాలు, ప్రవర్తనలకు సంబంధించిన ప్రశ్నలను పొందుపర్చాం. ఈ ప్రశ్నావళి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) వారు రూపొందించినవి. ► రోగ లక్షణాలు కలిగిన వారు ఈ యాప్‌లో వ్యక్తిగతంగా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నావళి ద్వారా సరిచూసుకోవచ్చు. ఇందులో సులభంగా ఎస్/నో ఆప్షన్లు ఉంటాయి. ఆ వివరాలు వైద్య విభాగానికి నేరుగా మెయిల్ ద్వారా వెళ్తాయి. ► జ్వరం, తలనొప్పి, ప్రయాణ చరిత్ర, ఊపిరి ఇబ్బంది వంటి 11 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు బట్టి తక్కువ ప్రమాదం, మధ్యస్థం, అత్యధిక ప్రమాదం వంటి మూడు రకాల రిజల్ట్‌లో ఏదో ఒకటి వస్తుంది. అప్లికేషన్లో ఇచ్చిన సమాధానాలు బట్టి అత్యధిక ప్రమాదం అనే రిజల్ట్ వస్తే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ఈ ఆప్లికేషన్‌లో ఉంది. -
కరోనా: మిషన్.. మే 15
సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో కోవిడ్–19 జీరో కేసులే లక్ష్యంగా ‘మిషన్ మే 15’ కోసం ప్రతి విభాగం పాటుపడుతుందని కోవిడ్–19 నియంత్రణ ప్రత్యేకాధికారి, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి మరో మూడు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. (ఉరి వేసుకుని ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య) నరసరావుపేట కరోనా హాట్‌స్పాట్‌గా మరిందన్నారు. ఈ పరిస్థితుల్లో గత ఐదురోజులుగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించి సోమవారం ఒక రోజు వెసులుబాటు కల్పించామన్నారు. ఈ క్రమంలోనే జీరో కేసులే లక్ష్యంగా మిషన్ మే 15 అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. మున్సిపాలీ్టలో ప్రభుత్వ ఆరోగ్య విభాగం ద్వారా అనుమానితులు అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తామన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఇళ్ల ముందు మూకుమ్మడిగా కూర్చోవటం, ఒకే చోట గుమికూడి ఆటలు ఆడటం సరికాదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసరాలు, మందులు డోర్ డెలివరీ ద్వారా అందజేస్తామన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా ఒక్క నరసరావుపేటలోనే 3,500 పరీక్షలు చేయగా ఇది బిహార్ రాష్ట్రం మొత్తం చేసిన దానికంటే ఎక్కువ అన్నారు. రెడ్‌జోన్ వరవకట్టను జల్లెడ పట్టి 1,200 మందికి పరీక్షలు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్‌్కలు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.వీరారెడ్డి, ట్రైనీ డీఎస్పీ మాధవరెడ్డి, ప్రజారోగ్యశాఖ ఈఈ ఎ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జనతా బజార్ సందర్శన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినుకొండరోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న జనతా బజార్‌ను సోమవారం ఉదయం నరసరావుపేట కోవిడ్–19 ప్రత్యేకాధికారి దినేష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. జనతా బజార్లలో ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయాలు జరపాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
‘రాజకీయ లబ్ధి కోసమే ఆ ఆరోపణలు’
సాక్షి, గుంటూరు: తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) రాష్ట్ర్రంలో మొత్తం 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘దిశ’ ఎస్ ఓ ఎస్ యాప్ ను కూడా రూపొందించామని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని.. కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పోలీస్ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. -
కోడెల ఆత్మహత్యకు కారకుడు చంద్రబాబే
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు కోడెల కుమారుడు, కుమార్తె కారణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడి గుంటూరులోని తన అల్లుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుంటూరులోనే ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించక పోగా, దగ్గరుండాల్సిన ఆయన కుమారుడు కెన్యాలో ఉన్నాడని, కుమార్తె, భార్య హైదరాబాద్‌కే పరిమితమయ్యారన్నారు. దీంతో అన్ని విధాలుగా తాను ఏకాకినయ్యానని భావించిన కోడెల విరక్తితో హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన కోడెల సంతాప సభలో మాజీ సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంపైన, సీఎం జగన్మోహనరెడ్డిపైన, తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంతాప సభను టీడీపీ నాయకులు రాజకీయ వేదికగా మార్చుకున్నారే కాని నిజంగా కోడెలకు నివాళులు అర్పించలేదన్నారు. రూ.లక్ష ఇస్తాం, ఫర్నిచర్ ఇస్తావా? కోడెల తీసుకొచ్చిన ఫర్నిచర్ కేవలం రూ.లక్ష విలువే నంటూ చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ఫర్నిచర్‌కు తాము రూ.లక్ష ఇస్తామని తీసుకొచ్చి ఇవ్వలగలరా అని ప్రశ్నించారు. దీనిలో 14 కుర్చీలతో గల బిజినెస్ టేబుల్ రూ.65 లక్షలని, ఇవి ఇతరదేశాలకు చెందిన ఫర్నిచర్ అని, గతంలో పనిచేసిన స్పీకర్లు తెప్పించారన్నారు. మొత్తం ఫర్నిచర్ విలువ రూ.1.5 కోట్ల విలువ ఉంటుందన్నారు. వాస్తవాలు బయటకు రావాలి కోడెల అసలు ఎందుకు చనిపోయాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడితే ఆ వ్యక్తి దగ్గర 21 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండాలనే నిబంధన ప్రతి డాక్టర్‌కు తెలుసు అన్నారు. ఈ విషయం డాక్టర్లు అయిన కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా తెలియంది కాదన్నారు. ఆయన వెంట ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంచటం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కేసుల్లో ఎవరినీ అరెస్టు చేయవద్దని స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆరోజు 9.45 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు 10.30కు సమాచారం ఇచ్చారన్నారు. చివరిసారిగా తన కుమార్తెకు దండం పెట్టి పైన ఉన్న తన గదికి వెళ్లారన్నారు. గదిలోకి పోయిన కోడెల ఏం చేస్తున్నాడనేది కూడా వారు పరిశీలించలేదన్నారు. తన మిత్రులకు ఫోన్ చేసి తాను చివరిసారిగా మాట్లాడుతున్నానని చెప్పారన్నారు. తమపై పెట్టిన కేసుల్లో బాధితులకు రూ.6,7 కోట్లు డబ్బులు ఇచ్చేద్దామని కుమారుడు, కుమార్తెకు చెప్పినా వారు వినలేదన్నారు. వీటన్నింటిపై విచారణ తప్పకుండా జరగాలన్నారు. చంద్రబాబు తమపై వ్యాఖ్యానించిన ‘‘పనికిమాలిన ఎమ్మెల్యే’’, ‘‘గెలిచారో.. లేదో’’ అన్న మాటలపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ఈనెల 3వతేదీన అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇస్తామన్నారు. నిజంగా కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే కుమారుడు, కుమార్తెకు నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కోడెల చావును శవరాజకీయం చేయటం మానుకోవాలని చంద్రబాబును కోరారు. చీకటి రాజకీయాలు చంద్రబాబుకే ఎరుక ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఇలాగే ఉంటుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, జగన్మోహనరెడ్డి నేరస్తుడని ఏ కోర్టు అయినా ముద్ర వేసిందా అని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు లాగా కేసులకు భయపడి చీకట్లో చిదంబరాన్ని కలవటం, తన పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపించి వారి కాళ్లు పట్టుకునే పనులు జగన్ చేయలేదన్నారు. ధైర్యంగా కేసులు ఎదుర్కొం టున్నారన్నారు. -
కేసులు పెట్టింది టీడీపీ వాళ్లే
సాక్షి, గుంటూరు: కోడెలను ప్రభుత్వం వేధించిందని, వైఎస్సార్సీపీ నాయకులు కేసులు పెట్టించారని టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో సత్తెనపల్లి, నరసరావు పేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కే–ట్యాక్స్, ఉద్యోగాలిప్పిస్తామని, ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో అమాయకులను నమ్మించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారని చాలా మంది టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు, ప్రైవేట్ వ్యక్తులు ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారు. కోడెల తన కుమారుడి షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచారని అధికారులు గుర్తించాకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వాస్తవాలను టీడీపీ పెద్దలు విస్మరించి ఇష్టానుసారం మాట్లాడుతుండటం శవ రాజకీయమేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కోడెల మరణించాక రాద్ధాంతం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నాయకులు.. కోడెల, కోడెల కుమారుడు, కుమార్తెలపై వరుస కేసులు నమోదవుతున్నన్ని రోజులు పెదవి కూడా విప్పలేదు. వాటిపై స్పందిస్తే ఎక్కడ పార్టీ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయోనని భయపడ్డారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ పార్టీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ కోడెల పార్టీ పరువును బజారుకీడ్చాడని వ్యాఖ్యానించారు. కోడెల తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సైతం అప్పట్లో ప్రకటించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు.. రూ.2 లక్షల ఫర్నిచర్ తీసుకెళ్తే తప్పా అని రాద్దాంతం చేస్తుండటం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కోడెలపై రెండు కేసులే.. కోడెలపై 19 కేసులు పెట్టారని, ఆయన్ను వేధింపులకు గురిచేశారని టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి కోడెలపై నమోదైంది రెండు కేసులు మాత్రమే. మిగిలిన కేసులన్నీ కోడెల కుమార్తె, కుమారుడిపై నమోదయ్యాయి. వీరు కె–ట్యాక్స్ పేరుతో సొంత పార్టీ నాయకులను సైతం దోచుకున్నారు. వారి ఆస్తులను ఆక్రమించారు. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలోని వివాదాస్పదంగా ఉన్న 17 ఎకరాల భూమిని కాజేశారు. ఈ క్రమంలో ఎంతో కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్న టీడీపీ నాయకుడు గొడుగుల సుబ్బారావుతో పాటు మరికొందరి వద్ద నుంచి ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారు. పొలంలో గొడుగుల సుబ్బారావు ఏర్పాటు చేసుకున్న గృహం, కోళ్ల ఫారాలను అర్ధరాత్రి ఖాళీ చేయాలంటూ కోడెల తనకు చెందిన గుండాల ద్వారా అప్పట్లో బెదిరించాడు. అప్పట్లో కోడెల స్పీకర్ హోదాలో ఉండటంతో ఆయన చేస్తున్న దుశ్చర్యకు కొందరు పోలీసులు అధికారులు అండగా నిలిచారు. ఆ భూమిని కోడెల వ్యక్తిగత అంగరక్షకుడు ప్రతాప్‌కు చెందిన శశి ఇన్ఫ్రా పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. గొడుగుల టీడీపీ నాయకుడే. కోడెల 2014 సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వచ్చినప్పుడు సుబ్బారావు ఇంటిని సందర్శించారు. అప్పుడు సుబ్బారావు టీడీపీ తీర్థం తీసుకోవడంతో పాటు, రూ.లక్ష పార్టీ ఫండ్ కూడా ఇచ్చాడు. ఆ విషయాన్ని మరచి, పార్టీ నాయకుడనే సానుభూతి కూడా లేకుండా కోడెల, కోడెల కుమారుడు.. సుబ్బారావు స్థలాన్ని ఆక్రమించారు. ఈ ఘటనపై సుబ్బారావు తల్లి గొడుగుల శ్రీరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఓ కాంట్రాక్టు వ్యవహారంలో తనతో కోడెల శివరామ్ రూ.5 లక్షలు తీసుకున్నాడని నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన టీడీపీ నాయకుడు వడ్లమూడి శివరామయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను గతంలో టీడీపీలో పలు పార్టీ పదవుల్లో సైతం పని చేశాడు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా పని చేస్తున్నాడు. -
రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల
సాక్షి, గుంటూరు : ఎన్నికలు దగ్గరపడుతున్నా...గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా రాయపాటి వర్గం పావులు కదిపింది. కోడెల శివప్రసాదరావు చిరకాల ప్రత్యర్థి నల్లపాటి రామును టీడీపీలో చేర్చించడమే కాకుండా, ఏకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేయించారు రాయపాటి. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ కోడెలకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై కోడెల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అరవింద బాబును కూడా కోడెల శివప్రసాదరావు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ ద్రోహి అరవింద్ బాబు అంటూ తన అనచరులతో ర్యాలీ కూడా చేయించారు. అయినప్పటికీ తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ‘నల్లపాటి’ విషయంలో రాయపాటి.. కోడెలపై పైచేయి సాధించినట్లు అయింది. -
కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి
నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేరును ప్రకటించడంతో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యతిరేక వర్గీయులదే పైచేయి అయింది. ముఖ్యంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తనను కనీసం నియోజకవర్గంలోకి రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించినందుకు కోడెల, అతని కుమారుడిపై రాయపాటి కక్ష తీర్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మూడు రోజుల క్రితమే డాక్టర్ చదలవాడను రాయపాటి, ప్రత్తిపాటి ఆశీస్సులతో కోడెల వ్యతిరేక వర్గీయులు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, వాసిరెడ్డి రవీంద్ర, చల్లా సుబ్బారావు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. చదలవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. నరసరావుపేటకు వచ్చిన చదలవాడ తనను హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించిందని మీడియాకు చెప్పారు. జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. -
కొండ పండుగకు సర్వం సిద్ధం
హిల్ ఫెస్టివల్‌కు నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి హాజరయ్యే పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదం అందించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన విశాల మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్టు, పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ఫ్లవర్ షో, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాలు ప్రత్యేకఅనుభూతి కలిగించనున్నాయి. గుంటూరు, నరసరావుపేట రూరల్: దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న హిల్ఫెస్టివల్కు కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తఅయ్యాయి. కోటప్పకొండను అధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి పరిచేదానిలో భాగంగా హిల్ఫెస్టివల్ను కోటప్పకొండలో రెండు రోజల పాటు నిర్వహిస్తున్నారు. హిల్ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువ భాగంలోని విశాలమైన మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్డు, పలు రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. లేపాక్షి స్టోర్స్, రాజస్థాన్ ఆర్ట్స్, పెయింటింగ్ ఎగ్జిబిషన్, శాండ్ ఆర్ట్స్, డ్వాక్రా బజార్‌ను సిద్ధం చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ప్లవర్ షో కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. చిలకలూరిపేట రోడ్డులో హెలీకాప్టర్ రైడింగ్‌కు హెలీప్యాడ్‌ను, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, ఫారా గ్రైడర్, ఎటివి రైడ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్, రాప్టింగ్, హార్స్ రైడింగ్, ఒంటే సవారీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనున్నాయి. ఎర్రచెరువులో బోటు షికారుకు ప్రత్యేక బోట్లను రప్పించారు. ఫెస్టివల్‌కు వచ్చే వీఐపీల కోసం ఎర్రచెరువు కట్టపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటుచేశారు. అలాగే పండుగ జరిగే రెండు రోజుల పాటు ఐదు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. దాదాపు 210 మంది కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మొదటిరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సీనీసంగీత విభావరిలో గాయకులు వందేమాతరం శ్రీనివాస్ బృందం, జబర్దస్ట్ బృందంచే హాస్యప్రదర్శన, పద్యాలు, పాటలు, రింగ్ డాన్స్, ఒరిస్సా రణపా డాన్స్, ఉత్తరప్రదేశ్ కళాకారుల చూ డాన్స్, మహారాష్ట్ర కళాకారుల లవణి డాన్స్, శివకుమార్ మిమిక్రీ ఏర్పాటుచేశారు. గ్రామీణ ఆటల పోటీలు, ఎమ్యూజ్మెంట్ పార్క్ యువతకు ఆహ్లదాన్ని కలిగించనున్నారు. పర్యాటకులను అబ్బురపరిచేలా బాణసంచాను వెలిగించనున్నారు. -
జగన్‌కు జేసీ ప్రభాకరరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
► ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ ► నరసరావుపేటలో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మ దహనం నరసరావుపేట : వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని తులనాడిన జేసీ ప్రభాకరరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ప్రభాకరరెడ్డి క్షమాపణకు అసెంబ్లీలో డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు నరసరావుపేటలో ఆందోళన చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మతో ఊరేగింపుగా మల్లమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. జేసీ క్షమాపణ చెప్పాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మల్లమ్మ సెంటర్లో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి, మద్యం సేవించి, రోడ్డుపై కూర్చుని సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ప్రభాకరరెడ్డికి సంస్కారంలేదనేది స్పష్టమయిందన్నారు. హత్యలు చేసి, అరాచకానికి పాల్పడి, డబ్బులు సంపాదించి లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రభాకరరెడ్డి ప్రతిపక్షనేత జగన్‌కు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పెట్టిన భిక్షతోనే జేసీ దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి గెలుపొందారన్నారు. స్థాయిని మరిచి ప్రభాకరరెడ్డి ఈవిధంగా దూషించడాన్ని యావత్తు రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్.సుజాతాపాల్, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, వేముల శివ, షేక్.ఖాదర్‌బాషా, మల్లెల అశోక్, షేక్.సైదావలి, షేక్.మహబూబ్‌బాషా, విద్యార్థి విభాగ నాయకుడు ఆకాష్, బుజ్జి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, షేక్.రెహమాన్, కారుమంచి మీరావలి తదితరులు పాల్గొన్నారు. కొమెరపూడిలో .. సత్తెనపల్లి : మండలంలోని కొమెరపూడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సెంటర్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం - దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది - అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు - మహేశ్‌రెడ్డి చేరిక సందర్భంగా నరసరావుపేటలో భారీ బహిరంగ సభ సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: మోసకారి పాలకులు రాష్ట్రాన్ని అడ్డగో లుగా అమ్మేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడిని కాలర్ పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలా నిలదీస్తేనే రాజకీయా ల్లో ఉన్న నాయకులకు భయం కలుగుతుందని.. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలనుకొనే నేతలు వెనక్కి తగ్గుతారన్నారు. కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోటెత్తిన జనసందో హాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రజలు అల్లాడిపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లడబ్బుతో తెలంగా ణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబా బు అడ్డంగా దొరికిపోయారని, ఆడియో, వీడియో టేపులు కూడా బయటకు వచ్చాయ న్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ముఖ్యమంత్రిపై ధ్వజ మెత్తారు. మనకు రావాల్సిన నీళ్లను ఎగువ నుంచి తెలంగాణ ఎత్తుకుపోతున్నా గట్టిగా నిలదీసే పరిస్థితి సీఎంకు లేకుండా పోయిందన్నారు. ప్రధానమంత్రి మోదీని చూసి చంద్రబాబు వణికిపోతున్నారని చెప్పా రు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాట తప్పిన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ లేక నీళ్లు నములుతున్నారని ఆరోపించారు. గట్టిగా నిలదీస్తే.. ఈ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారనే భయం చంద్రబాబును వెం టాడుతోందని వివరించారు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలు పాలకులకు ఇవ్వాల న్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి అందరమూ ఒక్కటవుదామని పిలుపునిచ్చారు.బాబు కాలర్ పట్టుకొని దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. సభలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పు డూ ఒకమాట చెబుతుండేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని అనేవారు. అబద్ధా లు చెప్పి, మోసం చేసే ముఖ్యమంత్రి వద్దని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నాయకుడంటే ప్రజలంతా గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను మోసం చేసిన వాడు తమ నాయకుడని ప్రజలు సిగ్గుతో తలదిం చుకొనే విధంగా ఉండకూడదు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు వచ్చారు.. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు.. నోటీసులు మాత్రం వచ్చాయి. రుణమాఫీ చేయకుండా రైతులను దగా చేశారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా అక్కచెల్లెమ్మలను వంచించారు. మోసం చేయకుండా సమాజంలోని ఏ వర్గాన్నీ వదల్లేదు. బాబొస్తే జాబొస్తుందంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అం దజేస్తామన్నారు. గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు’’ అని జగన్ నిప్పులు చెరిగారు. జంగా కృష్ణమూర్తికి అన్యాయం జరగదు ‘‘ఈ రోజు కాసు మహేశ్‌రెడ్డిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నాకు తోడుగా రా.. అన్నగా నీకు అండగా నిలుస్తానని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు పాలన తో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారు. ఆయన చేసిన మోసాల వల్ల జనం అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత పాలనకు చరమగీతం పాడాలంటే మనమం తా ఒక్కటి కావాలి. అందులో భాగంగానే మహేశ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాను. మహేశ్ రాక వల్ల నరసరావుపేటలో గందర గోళం(కన్ఫ్యూజన్) నెలకొంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆనందంగా ఎదురు చూస్తున్నారమో! ఎలాంటి గందరగోళం ఉండదని నేను గట్టిగా చెబుతున్నా. కారణం ఏమిటంటే.. మహేశ్‌ను చేర్చుకునే ముందు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తితో మాట్లాడాను. ప్రజలను అడు గడుగునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభు త్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని జంగన్న (జంగా కృష్ణమూర్తి)తో చెప్పా. తర్వాత ఇద్దరం కలసికట్టుగా ఆలోచన చేశాం. గురజా ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. క్లబ్బుల దగ్గర్నుంచి మైన్ల దాకా.. ఇసుక దగ్గర్నుంచి చివరకు సినిమా థియేటర్ల దాకా అంతటా అరాచకమే. అక్కడ రౌడీయి జమే రాజ్యమేలుతోంది. ఇలాంటి దారుణాల కు అడ్డుకట్ట వేయడానికి యువకుడు, ఉత్సా హవంతుడు అయిన మహేశ్‌రెడ్డిని తీసుకొద్దా మని చెప్పా. గురజాల నియోజకవ ర్గంలో నిలబడుతున్న నా తమ్ముడు మహేశ్‌ను ఆశీర్వ దించాలని ప్రజలను కోరుతున్నా. నరసరావు పేట నియోజకవర్గంలో అందరికీ పరిచయçస్తు డు, డాక్టరు, సౌమ్యుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనసాగుతారు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్లు నాకు నాన్నగా అండగా నిలిచా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదని గట్టిగా చెబుతున్నా. నేను ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న ఆరు నెలలకే జంగన్నను చట్టసభల్లోకి తీసు కొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానని సభాము ఖంగా చెబుతున్నా’’ అని జగన్ అన్నారు. బాబు మోసం చేశారు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారా? లేదా? సభికులను జగన్ అడిగారు. ఇచ్చారని సభికుల నుంచి సమాధానం వచ్చింది. చేతులు ఊపుతో చెప్పాలని జగన్ కోరడంతో.. అందరూ చేతులు పైకెత్తారు. బాబు మోసం చేశారని బిగ్గరగా బదులిచ్చారు. రుణమాఫీ జరిగిందా? సభికులకు మళ్లీ జగన్ ప్రశ్న. లేదు.. లేదు.. అని సభికుల సమాధానం. రెండు చేతులూ పైకెత్తి.. చేయి తిప్పుతూ.. రుణమాఫీ జరిగిందో.. లేదో.. చూపించాలని జగన్ అడిగారు. కిక్కిరిసిన సభలో అందరూ చేతులు పైకెత్తి రుణమాఫీ చేయలేదంటూ చేతులు తిప్పారు. రుణమాఫీ చేస్తానని బాబు మోసం చేశారా? లేదా? మళ్లీ జగన్ ప్రశ్న. బాబు మోసం చేశాడు.. సభికుల సమాధానం. రెండు చేతులు పైకెత్తి చెప్పాలని మళ్లీ జగన్ సూచన. సభలో ఉన్న వారంతా చేతులు పైకెత్తి మోసం చేశారన్నట్లుగా చేతులు ఊపారు. బాబు మోసం చేశారంటూ గట్టిగా చెప్పాలని జగన్ మళ్లీ అడిగారు. ‘బాబు మోసం చేశారు’ అని ప్రజలు గట్టిగా నినదించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందంటూ యువతకు చేసిన మోసం గురించీ ఇదే విధంగా జగన్ సభలో ఉన్న వారిని అడిగారు. రెండు చేతులు పైకెత్తి.. చేతులు తిప్పుతూ.. బాబు మోసం చేశారంటూ ప్రజలు నినదించారు. కాగా కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యమైందనీ అంతం వరకూ వైఎస్సార్సీపీ ఉంటానన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలన్నారు. -
నరసరావుపేటలో వైఎస్ జగన్ పర్యటన
-
అప్పటి వరకు విశ్రమించేది లేదు..
-
‘బాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయం’
నరసరావు పేట: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపే రోజు వచ్చిందనీ ఆయన హెచ్చరించారు. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. గురజాల ఎమ్మెల్యే చేస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావని, రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన ఉందని, అది చూసి బాబు కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని తెలిపారు. శుక్రవారం నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జన సందోహం మధ్య కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మహేష్ రెడ్డిని పార్టీలో చేర్పించుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మషేష్ రెడ్డికి అన్ని వేళల్లో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పరిపాలనపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ప్రజలతో కిక్కిరిసిన రెడ్డి కాలేజీ మైదానం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఆ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు ప్రజల నుంచి చప్పట్లు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయకపోవడంపై పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఉటంకించగా అవును... అమలు చేయలేదంటూ ప్రజల నుంచి పెద్దపెట్టిన ప్రతిస్పందనలు వినిపించాయి. నిజానికి ఈ సభ సాయంత్రం 4 గంటలకే జరగాల్సి ఉండగా, జిల్లాలో అడుగుపెట్టింది మొదలు మార్గమధ్యంలో అన్ని చోట్ల ప్రజలు జగన్ కలవడానికి పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనను నిలువరించి స్వాగతం పలకడం, ఆయనతో కరచాలనం చేయడానికి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఎగబడటంతో ఆయన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సభ 8 గంటల సమయంలో మొదలైంది. జగన్ అక్కడికి చేరుకోవడం గంటల కొద్దీ ఆలస్యమైనప్పటికీ జనంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా యువకులు పెద్దఎత్తున హాజరు కావడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు అడుగడుగునా చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతూ ఊత్సాహం ప్రదర్శించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జనం విశేషంగా స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టుగా... ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది నాయకుడికి ముఖ్యమని జగన్ గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునేలా నాయకుడు ఉండాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడును చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. నిత్యం అబద్దాలు ఆడటం... మోసాలు చేయడం... ఇదే ఆయన నాయకత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు, అబద్దాలకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. అవినీతిలో ఏపీని నెంబర్ 1 చేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు... చివరికి ఏమైంది... రైతులను నిలువునా మోసం చేశారు... అవునా... కాదా.. మీరేమంటారు? అని సభికులను ప్రశ్నించినప్పుడు అవును.. అవును అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. అనంతరం వారినుద్దేశించి చంద్రబాబు పాలన బంగాళా ఖాతంలో పడేందుకు ఇక రెండేళ్ల గడువుందని, కాలం కలిసొస్తే ఏడాదిలోనే పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు. అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తామన్నారు. మరి ఆయన ఇప్పుడేం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు... మీరేమంటారని మళ్లీ ప్రశ్నించగా అవునంటూ దద్దరిల్లే సమాధానం సభ నుంచి వచ్చింది. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించడానికి సంబంధించి, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలను ప్రస్తావించి అధికారం చెపట్టిన తర్వాత ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ రకంగా చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు... నోరు తెరిస్తే మోసం చేయడం మామూలైపోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇలా అబద్ధాలు చెప్పే... ఈ రకంగా మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసులకు భయపడి... చంద్రబాబు తనపైన కేసులు ఎక్కడ వచ్చి పడుతాయోననీ, ఇప్పటికే ఇరుక్కున్న కేసుల్లో ఎక్కడ తెరమీదకు వస్తాయోనన్న భయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా అటు కేంద్రంపైన గానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంపైన గానీ నోరు మెదపడం లేదని జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి బ్లాక్ మనీని తీసుకెళ్లి సూట్ కేసుల్లో పెట్టి ఇస్తుంటే... ఆ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు. ఆ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఆ కేసులకు, అవన్నీ బయట పడుతాయని భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఆనాటి ఘటనలను గుర్తూచేస్తూ, ఆ హామీతోనే ఆరోజు రాష్ట్రాన్ని విడదీశారని విడమరిచి చెప్పారు. అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితి లేరని పేర్కొంటూ అందుకు కారణాలను విశ్లేషించారు. గడిచిన రెండున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి పాల్పడ్డారని, కేంద్రాన్ని ఏమనడిగినా తన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని భయపడి అడగటం లేదని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజలను విస్మరించిన చంద్రబాబు, ఆయన పాలన అంతం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే తీర్పుతో నాయకులు ఇక అబద్దాలు చెప్పాలంటే... మోసం చేయాలంటే... భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాబు మోసాలకు, అబద్దాలకు ఫలితంగా ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు తప్పదని చెప్పారు. ఈరోజు పార్టీలో చేరిన మహేష్ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని జగన్ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. -
‘బాబును బంగాళాఖాతం లో కలపడం ఖాయం’
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి
నరసరావు పేట: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని, అప్పటి వరకు వరకు వైఎస్ జగన్ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్ రెడ్డి. ఆయన శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జేజేల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. గుంటూరు జిల్లా నరసరావు పేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలల్లో వచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. 'పౌరుషాలకు, ప్రతాపాలకు మారు పేరు పల్నాడు. ఏపీలో దుర్మార్గపు పాలన జరగుతోంది. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారు. నాగార్జున సాగర్ ను శ్మశానం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే వైఎస్ఆర్ సీపీలోకి వచ్చా. జగన్ ను సీఎం చేసి ఈ ప్రాంతానికి పట్టిన శని వదిలిద్దాం' అన్నారు. -
ఏరువాక సాగింది...
విఘ్నేశ్వరా ఈ ఏడాదైనా సాగుకు ఆటంకం లేకుండా చూడు.. భూమాతా మా ఇంట ధాన్యరాశులు నిండాలని దీవించు.. అంటూ అన్నదాతలు వేడుకున్నారు. వ్యవసాయ పరికరాలను, వృషభ రాజులను పూజించి సాగుకు శ్రీకారం చుట్టారు. హలాల నెత్తుకుని పొలాలకు బయలుదేరిన ఇంటి యజమానులకు మహిళలు హారతులిచ్చారు. జ్యేష్ట శుద్ధ పౌర్ణమి రోజున ఏటా ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించుకోవడం గ్రామాల్లో ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో ఏరువాక ఇలా సాగింది.. నరసరావుపేట రూరల్ : ఏరువాక సాగింది.. కర్షకుల కళ్లల్లో ఆనందం ఉప్పొంగింది.. భూమితల్లి మురిసిపోయింది. తమ ఇంటి యజమానులు పొలాల వెంట బయలుదేరుతుంటే మహిళాలోకం హారతి పట్టింది. పెద్దా, చిన్న, సన్నకారు రైతులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు వృషభరాజులకు ప్రత్యేక పూజలు చేసి హలాలు భుజానెత్తుకొని కోటి ఆశతో సాగు పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఏరువాక జేష్ట శుద్ధ పౌర్ణమినాడు పండుగను ఘనంగా నిర్వహించుకోవడం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరా.. ఈ ఏడాదైనా మా సాగుకు, మా ఇంట దిగుబడురాసులకు విఘాతం కలిగించవద్దు అని వేడుకుంటూ గ్రామాల్లోని గణపతి ఆలయాల్లో రైతులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని యల్లమంద, పాలపాడు, పెదరెడ్డిపాలెం, కేసానుపల్లి, పెట్లూరివారిపాలెం, ఇక్కుర్రు, పమిడిపాడు, కొండకావూరు, గురవాయిపాలెం తదితర ప్రాంతాల్లో ఏరువాక సాగింది. అన్నదాతలు ముల్లుకర్ర చేతపట్టి, మర్రి ఆకులు మరచెంబులో నీరు, విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. నలుదిక్కులా పసుపు, కుంకుమ వెదజల్లి సాగుకు శ్రీకారం చుట్టారు. యల్లమంద గ్రామంలో వందలాదిమంది మహిళలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వరాలయం వరకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి సేద్యానికి సహకారం అందించే వ్యవసాయ పనిముట్లు, అరకలు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. -
మథనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పార్టీ అధినేత ఆదేశానుసారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలవారీ సమీక్షలలో భాగంగా జిల్లాలో సమీక్షకు త్రిసభ్య కమిటీ ఆదివారం శ్రీకారం చుట్టనుంది. కమిటీ సభ్యులైన కొలుసు పార్థసారథి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ జిల్లాకు రానున్నారు. ఆదివారం నరసరావుపేట లో, సోమవారం గుంటూరులో సమీక్షలు జరుగుతాయి. జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జయాపజయాలపై ఈ సమీక్షలు జరగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లాకు రానున్నది. మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వీటిని నిర్వహించనున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. జూన్ 1వ తేదీ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై నరసరావుపేటలోని శుభం కల్యాణ మండపంలోనూ, జూన్ 2వ తేదీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మంట్లపై సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేసిన అభ్యర్ధుల నుంచి అభిప్రాయాలను ఈ కమిటీ తీసుకోనున్నది. పార్టీలోని నాయకులు తమకు సహకరించలేదని కొందరు అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన సమయంలో ఫిర్యాదు చేశారు. అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల నిర్వహణలోని లోపాలపై కార్యకర్తలు కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేకపోలేదు. సమీక్షల్లో ఎంపీ అభ్యర్థులు బాలశౌరి, అయోధ్యరామిరెడ్డి, జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారని జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. -
కోటప్పకొండ జాతరకు పటిష్ట బందోబస్తు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్ కోటప్పకొండ తిరునాళ్ల జాతరను విజయవంతం చేసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. మహిమాన్విత పుణ్యక్షేత్రం కోటప్పకొండపై సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రూరల్ ఎస్పీ మాట్లాడుతూ కొండకు తరలివచ్చే విద్యుత్ ప్రభలపై రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీల జెండాలు, సినిమా హీరోల కటౌట్లు, వాల్‌పోస్టర్లు పెట్టకూడదన్నారు. ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఎవరైనా ప్రభలపై పార్టీల జెండాలు, రాజకీయ నాయకుల ఫొటోలు ఏర్పాటు చేస్తే సంబంధిత ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యా దు చేయడంతో పాటు ప్రభల నిర్వాహకులపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు. స్నానా ల ఘాట్, మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. గతేడాది 2500 పోలీసు సిబ్బంది కోటప్పకొండ జాతర విధులు నిర్వహించారని, ఈ ఏడాది 4000 మంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోటప్పకొండ ప్రాంతంలోని చిలకలూరిపేట రోడ్డు, నరసరావుపేట, పెట్లూరివారిపాలెం, కొండకావూరు రహదార్ల వద్ద పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభలను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం ఆరు గంటల నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 వెర్లైస్ సెట్లతో సిబ్బంది ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం మొబైల్ పార్టీలు ఆ ప్రాంతానికి చేరుకొని క్రమబద్ధీకరిస్తారన్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖల సహకారంతో తిరునాళ్లలో ఎలాంటి సంఘటన లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, దేవస్థానం ఈవో రామకోటిరెడ్డి, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, కమ్యూనికేషన్స్ డీఎస్పీ రమణ, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తొలుత త్రికోటేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎస్పీ సత్యనారాయణకు ఈవో రామకోటిరెడ్డి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
చూడీ లేదు..పాడీ లేదు
వట్టిపోయిన పశుపిండోత్పత్తి కేంద్రం శిథిలావస్థకు చేరిన ప్రయోగశాలలు బీడుగా మారిన 530 ఎకరాలు పశువుల పెంపకానికే పరిమితం భూములపై కన్నేసిన కబ్జాదారులు గడ్డిపెంపక కేంద్రంగా ప్రతిపాదనలు సాక్షి, నరసరావుపేట మేలుజాతి పశువుల పునరుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ (పశు పిండోత్పత్తి కేంద్రం) వట్టిపోయింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు శిధిలావస్థకు చేరాయి. ఐదు దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం బఫెలో బ్రీడింగ్ సెంటర్ నెలకొల్పింది. అయితే సాగర్ నిర్మాణ సమయంలో ఈ కేంద్రం ముంపు బారినపడటంతో నకరికల్లు మండలం నర్సింగపాడు శివారులోని 530 ఎకరాల అటవీ భూముల్లోకి దీనిని మార్పు చేసింది. దీని అవసరాల కోసం త్రిపురాపురం వద్ద 130 ఎకరాల భూమిని కేటాయించింది. గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేసే జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్డీడీబీ) ఏర్పాటు చేసిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ సహకారంతో ఇక్కడ మేలు జాతి ముర్రా గేదెలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం నర్సింగపాడు శివారులో ప్రయోగశాలలు నిర్మించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు కలిగిన గృహ సముదాయాలు నిర్మించారు. త్రిపురాపురంలోని130 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన గేదెలను పరీక్షల నిమిత్తం ఇక్కడ ఉంచేవారు. ఆరు,ఏడు నెలల అనంతరం వాటికి ఎలాంటి జబ్బులు లేవని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే బీబీసీ కేంద్రానికి తీసుకొచ్చి పునరుత్పత్తి జరిపేవారు. ఈమేలు రకం గేదెల గర్భాశయంలో పిండాలను వృద్ధి చేసి ఏడు రోజుల తరువాత వాటిని ఎదకు వచ్చిన స్థానిక గేదెల గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ పాలు ఇచ్చే మేలు జాతి గేదెలను ఉత్పత్తి చేయడమే ఈ సెంటర్ లక్ష్యం. మొదట్లో బ్రహ్మాండంగా కొనసాగిన ఈ కేంద్రం రానురాను పాలకులు, అధికారుల అలసత్వంతో లక్ష్యాన్ని చేరుకోలేక 1992లో మూతపడింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్థి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థకు క్షీణదశ మొదలైంది. కొన్నాళ్లు పాడిగేదెల కేంద్రంగా, మరికొన్నాళ్లు గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా ఈ సంస్థను మార్చారు. పశువుల పెంపకానికే పరిమితం వేల కోట్ల విలువైన పొలాలు, కట్టడాలు, అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్న బీబీసీ కేంద్రం ప్రస్తుతం సామాన్య పశువుల పెంపక కేంద్రంగా మారింది. ఐదేళ్ళపాటు వీర్యం ఉత్పత్తి కేంద్రంగా పనిచేసిన బీబీసీ 2005 నుంచి కేవలం ముర్రాజాతి దున్నలు, జెర్సీ, ఒంగోలు జాతి కోడెదూడల కేంద్రంగా మారింది. గతంలో డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్, శాస్త్రవేత్తలు, వైద్యులు, వందమంది సిబ్బంది, 10 ట్రాక్టర్లతో కళకళలాడిన బీబీసీ కేంద్రం నేడు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. భూములపై కన్ను... త్రిపురాపురంలో ఉన్న 130 ఎకరాల భూములను ఆక్రమించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ కేంద్రంపై ప్రభుత్వం శ్రద్ధ వహించి పశుపరిశోధనా సంస్థగా మారిస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశువులకు అవసరమైన వీర్యాన్ని ఇక్కడి నుంచే అందించే వీలుంటుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రంలో గడ్డి పెంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినా వేసవిలో పశువులకు మేతలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తీరడంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. -
ఏడేళ్లుగా రిజిస్ట్రేషన్లు లేవు
సాక్షి, నరసరావుపేట: ఏడేళ్లుగా ఆ గ్రామంలోని భూములు రిజిస్ట్రేషన్లకు నోచుకోవడంలేదు. గ్రామంలోని భూములన్నీ తమవేనంటూ పుష్పగిరి పీఠాధిపతులు దేవాదాయశాఖను ఆశ్రయించడంతో ఆ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు 2007లో జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. పుష్పగిరి మఠానికి లింగంగుంట్లలో 1 నుంచి 335 సర్వే నంబర్లలోని 1452 ఎకరాల భూమి ఉందని, వీటి రిజిస్ట్రేషన్లు ఆపాలని దేవాదాయశాఖ అధికారులు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమవద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలని నిబంధన విధించారు. లింగంగుంట్లలోని 1 నుంచి 72 బ్లాకులలో ఉన్న 1959 ఎకరాల భూమికి నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో వందేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పుష్పగిరి పీఠాధిపతులకు సంబంధించిన 1452 ఎకరాలు పోను మిగతా భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించినా కమిషనర్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఎకరాకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలన్నా హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారుల ద్వారా రికార్డులు తెప్పించుకుని స్వయంగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా కమిషనర్ పట్టించుకోలేదు. గ్రామకంఠం భూములు, ఈనాం బీ రిజిస్టర్ ప్రకారం రైతులవేనని చెబుతున్న 507 ఎకరాల భూములకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని పుష్పగిరి పీఠాధిపతులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పీఠాధిపతులకు ఎంత భూమి ఉంది, రైతులకు ఎంత ఉంది అనే విషయాన్ని తేల్చకుండా రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తుండటంతో సమస్య జఠిలంగా తయారైంది. తమ భూములు తమకు ఇప్పించాలని గ్రామ రైతులు అప్పటి కలెక్టర్ ఆలీ రఫత్‌కు విన్నవించగా గ్రామంలోని భూములకు సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశాలిచ్చారు. తమ 1452 ఎకరాల్లో సర్వే నిర్వహించవద్దని పుష్పగిరి పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించడాన్ని అధికారులు సాకుగా చూపుతూ మిగిలిన భూముల్లో సైతం సర్వే నిర్వహించకుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం తదితర అవసరాలకు భూమిని విక్రయించుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకుల నుంచి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ సీఎం అయితే పరిష్కారం.. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి చొరవతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో లింగంగుంట్ల గ్రామస్తుల సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడంలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అంటున్నారు. బడాబాబుల పైరవీలు.. పైరవీలతో చిక్కుముడులను సరిచేసుకొని తక్కువ ధరలకు విలువైన భూములు కాజేసేందుకు కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ అధికారులకు చెప్పించుకొని ఫైళ్లను చక చకా కదుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇన్నేళ్లుగా తాము పోరాటం చేస్తున్నా పట్టించుకోని అధికారులు, బడాబాబులకు మాత్రం కొమ్ము కాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటీవల గ్రామాన్ని సందర్శించి బడాబాబులకు అనుకూలంగా నివేదికలు అందించేందుకు సమాయత్తమైనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దేవాదాయశాఖ ఆర్జేసీ శ్రీనివాస్ ఇటీవల గ్రామాన్ని సందర్శించినప్పటికీ గ్రామస్తులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక దేవదాయశాఖ అధికారులు సైతం ఆయన రాకను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
ఆఫీసుల్లోనే అంచనాలు
సాక్షి, నరసరావుపేట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంటల నష్టం అంచనా వేసేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి అధికారులు ఒక బృందంగా ఏర్పడి గ్రామాల్లో తిరిగి రైతుల జాబితాను తయారు చేయాల్సి ఉంది. దీని ఆధారంగా ప్రభుత్వం పరిహారం అందించనుంది. అయితే నష్టం అంచనాలో అధికారులు అవలంబిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శి, రెవెన్యూ అధికారి, వ్యవసాయశాఖ సిబ్బంది కలిసి ఓ బృందంగా ఏర్పడి పొలాలను సందర్శించి నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేయాల్సి ఉంది. అయితే వారంలోగా జాబితా తయారు చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు తమ కార్యాలయాల్లోనే కూర్చొని తూ తూ మంత్రంగా జాబితా తయారు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మండలాల్లో గ్రామాలు అధికంగా ఉండి సిబ్బంది తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఇచ్చిన సమయానికి జాబితా తయారు చేయలేమోననే భయంతో కిందిస్థాయి అధికారులు జాబితాను హడావుడిగా తయారు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామంటూ ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా జీడిమామిడి, మామిడి, సపోట, జామ, బత్తాయి, దానిమ్మ తోటలకు హెక్టారుకు 15వేల రూపాయలు, తమలపాకుల తోటకు సెం టుకు రూ. 300, పసుపుకు హెక్టారుకు రూ.4500 అందించేందుకు ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వం అందించనున్న నష్టపరిహారంతో అప్పులన్నీ తీర్చుకోలేకపోయినా గుడ్డిలో మెల్లలా ఎంతోకొంత వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే గతంలో నీలం తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న సమయంలో కూడా పరిహారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 50 శాతం పంటలు దెబ్బతిన్న రైతులకు మాత్రమే పరిహారం.. పంటలు దెబ్బతిన్న ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందిస్తామంటూ చెబుతూనే ప్రభుత్వం, అంచనాకు వెళ్లే అధికారులకు 50 శాతం పైగా పంటలు దెబ్బతిన్న రైతుల జాబితాను మాత్రమే తయారు చేయాలంటూ మెలిక పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు తమ ఇష్టమొచ్చిన వారి పేర్లను జాబితాలో చేరుస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామాల్లో అధికార పార్టీనేతలు, ఆదర్శ రైతులు అందించిన నష్టపరిహార జాబితాలనే అధికారులు ఖరారు చేస్తూ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. ఫైనల్ జాబితాలో వారి పేర్లు మాత్రమే చేరుస్తుండటంతో నిజమైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గత నీలం తుపాను సమయంలో కూడా అధికారులు ఇదే తీరున వ్యవహరించడంతో రైతులు అప్పట్లో రోడ్లపైకి చేరి ధర్నా లు, రాస్తారోకోలు చేశారు. అయితే పంట నష్టపరిహార జాబితా తయారు కాగానే ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే సంబంధిత తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు.