
పారాగ్లైడర్
హిల్ ఫెస్టివల్‌కు నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి హాజరయ్యే పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదం అందించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన విశాల మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్టు, పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ఫ్లవర్ షో, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాలు ప్రత్యేకఅనుభూతి కలిగించనున్నాయి.
గుంటూరు, నరసరావుపేట రూరల్: దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న హిల్‌ఫెస్టివల్‌కు కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తఅయ్యాయి. కోటప్పకొండను అధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి పరిచేదానిలో భాగంగా హిల్‌ఫెస్టివల్‌ను కోటప్పకొండలో రెండు రోజల పాటు నిర్వహిస్తున్నారు. హిల్‌ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువ భాగంలోని విశాలమైన మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్డు, పలు రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. లేపాక్షి స్టోర్స్, రాజస్థాన్ ఆర్ట్స్, పెయింటింగ్ ఎగ్జిబిషన్, శాండ్ ఆర్ట్స్, డ్వాక్రా బజార్‌ను సిద్ధం చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ప్లవర్ షో కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు.
చిలకలూరిపేట రోడ్డులో హెలీకాప్టర్ రైడింగ్‌కు హెలీప్యాడ్‌ను, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, ఫారా గ్రైడర్, ఎటివి రైడ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్, రాప్టింగ్, హార్స్ రైడింగ్, ఒంటే సవారీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనున్నాయి. ఎర్రచెరువులో బోటు షికారుకు ప్రత్యేక బోట్లను రప్పించారు. ఫెస్టివల్‌కు వచ్చే వీఐపీల కోసం ఎర్రచెరువు కట్టపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటుచేశారు. అలాగే పండుగ జరిగే రెండు రోజుల పాటు ఐదు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. దాదాపు 210 మంది కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మొదటిరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సీనీసంగీత విభావరిలో గాయకులు వందేమాతరం శ్రీనివాస్ బృందం, జబర్దస్ట్ బృందంచే హాస్యప్రదర్శన, పద్యాలు, పాటలు, రింగ్ డాన్స్, ఒరిస్సా రణపా డాన్స్, ఉత్తరప్రదేశ్ కళాకారుల చూ డాన్స్, మహారాష్ట్ర కళాకారుల లవణి డాన్స్, శివకుమార్ మిమిక్రీ ఏర్పాటుచేశారు. గ్రామీణ ఆటల పోటీలు, ఎమ్యూజ్‌మెంట్ పార్క్ యువతకు ఆహ్లదాన్ని కలిగించనున్నారు. పర్యాటకులను అబ్బురపరిచేలా బాణసంచాను వెలిగించనున్నారు.