
Muthoot finance
మెదక్ జిల్లా జహీరాబాద్లోని ముత్తుట్ ఫైనాన్స్లో గత నెలలో చోరీకి గురైన బంగారం విషయంలో వినియోగదారులకు నగదు చెల్లించాలని ఆ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. నగదు కుదవ పెట్టిన వినియోగదారులకు తులం బంగారానికి రూ. 20 వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు ముత్తుట్ ఫైనాన్స్ అధికారులు వెల్లడించారు.
ముత్తుట్ ఫైనాన్స్లో గతంలో 50 కేజీల బంగారం చోరీకి గురైంది. పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా 7 కేజీల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారు. అయితే తమ నగలను తమకు అప్పగించాలని వినియోగదారులు ఫైనాన్స్ కంపెనీని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వినియోగదారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో కుదవ పెట్టిన బంగారానికి అంత రూపంలో నగదు చెల్లించాలని ముత్తుట్ ఫైనాన్స్ నిర్ణయించింది.