
సినిమాకెళ్లి వచ్చేసరికి..
హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ పరిధిలో వెంకటరమణ కాలనీలో చరణ్ అనే ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది.
హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ పరిధిలో వెంకటరమణ కాలనీలో చరణ్ అనే ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. చరణ్ దంపతులు శనివారం రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి 25 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.36 వేల నగదు దొంగలించారు. తెలిసిన వాళ్లే పథకం ప్రకారం ఈ చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.