సునీల్, మన్ ప్రీత్ అవుట్ | Injured SV Sunil, Manpreet Singh Out of Hockey Squad For Asian Champions Trophy | Sakshi
Sakshi News home page

సునీల్, మన్ ప్రీత్ అవుట్

Published Sat, Oct 15 2016 11:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

సునీల్, మన్ ప్రీత్ అవుట్

సునీల్, మన్ ప్రీత్ అవుట్

బెంగళూరు:త్వరలో మలేషియాలో జరుగునున్న ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఎస్ వి సునీల్, మన్ ప్రీత్ సింగ్ లు దూరం కానున్నారు.  ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో వారికి విశ్రాంతి నివ్వనున్నట్లు కోచ్ ఓల్ట్మన్స్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా సునీల్ మణికట్టు గాయంతో బాధపడుతుండగా, మన్ ప్రీత్ గజ్జల్లో గాయమైనట్లు పేర్కొన్నాడు.

 

అయితే మన్ ప్రీత్ గాయం తగ్గుముఖం పట్టినా, మళ్లీ తిరగెట్టే అవకాశం ఉన్నందును అతనికి విశ్రాంతి ఇస్తున్నట్లు ఓల్ట్మన్స్ తెలిపాడు. వీరి స్థానంలో రమణ్ దీప్ సింగ్, అక్షదీప్ సింగ్ లు జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి మలేషియాలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement