SV Sunil
-
అంతర్జాతీయ హాకీకి భారత స్టార్ ప్లేయర్ గుడ్‌బై..
Sv Sunil Retires From International Hockey: భారత స్టార్ ప్లేయర్ ఎస్వీ సునీల్ అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్... తన 14 ఏళ్ల కెరీర్లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్ -
ఒకే నగరంలో ఉన్నా...
బెంగళూరు: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అనుకోని విరామ సమయంలో సాధారణ ప్రజలే ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. నిరంతరం ప్రయాణాలు, రోజంతా ప్రాక్టీస్, మ్యాచ్‌లు అంటూ బిజీగా గడిపే క్రీడాకారుల సంగతి చెప్పక్కర్లేదు. కుటుంబంతో సరదాగా గడిపే సమయం దొరికితే ఆటగాళ్లు ప్రపంచాన్ని, వారి ప్రాణమైన ఆటనే మర్చిపోతారు. కానీ భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన భార్య, గారాల కూతురు తనకు సమీపంలోనే నివసిస్తున్నా కుటుంబానికి దూరంగా జట్టుతో ఉంటున్నాడు. ప్రస్తుతం సునీల్ బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తుండగా... అతని భార్య నిషా, ఏడాదిన్నర వయస్సున్న కూతురు శాన్విత ‘సాయ్’ సెంటర్‌కు కేవలం 20 కి.మీ దూరంలోనే ఉంటున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం క్షేమం కోసమే తాను దూరంగా ఉంటున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన భార్య నిషా కూడా అతని నిర్ణయంతో ఏకీభవించిందని చెప్పాడు. ‘నేను నా భార్య, బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మనం ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందులోని సానుకూల కోణాన్నే మనం చూడాలి’ అని సునీల్ పేర్కొన్నాడు. -
భారీ విజయంతో వారియర్స్ బోణీ
రాంచీ: భారత స్టార్ ఫార్వర్డ్ ఎస్వీ సునీల్ మెరుపు ప్రదర్శనతో నాలుగు గోల్స్ సాధించడంతో... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్ బోణీ చేసింది. దబంగ్ ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 4–10తో ఓడిపోయిన పంబాబ్... బుధవారం రాంచీ రేస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7–0తో ఘనవిజయం సాధించింది. ఆట 25వ నిమిషంలో మింక్ వాన్‌డెర్ వీర్డెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో వారియర్స్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ 26వ నిమిషంలో, 34వ నిమిషంలో రెండు ఫీల్డ్ గోల్స్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో వారియర్స్ 5–0తో ముందంజ వేసింది. 43వ నిమిషంలో జేక్ వెటన్ ఫీల్డ్ గోల్ సాధించడంతో వారియర్స్ ఆధిక్యం 7–0కు పెరిగింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
సునీల్, మన్ ప్రీత్ అవుట్
బెంగళూరు:త్వరలో మలేషియాలో జరుగునున్న ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఎస్ వి సునీల్, మన్ ప్రీత్ సింగ్ లు దూరం కానున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో వారికి విశ్రాంతి నివ్వనున్నట్లు కోచ్ ఓల్ట్‌మన్స్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా సునీల్ మణికట్టు గాయంతో బాధపడుతుండగా, మన్ ప్రీత్ గజ్జల్లో గాయమైనట్లు పేర్కొన్నాడు. అయితే మన్ ప్రీత్ గాయం తగ్గుముఖం పట్టినా, మళ్లీ తిరగెట్టే అవకాశం ఉన్నందును అతనికి విశ్రాంతి ఇస్తున్నట్లు ఓల్ట్‌మన్స్ తెలిపాడు. వీరి స్థానంలో రమణ్ దీప్ సింగ్, అక్షదీప్ సింగ్ లు జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి మలేషియాలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. -
హాకీ సిరీస్ భారత్ కైవశం
పెర్త్: హాకీ ఇండియా పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు 3-1 తేడాతో విజయభేరి మోగించారు. వారి సొంత గడ్డపైనే వరుస మ్యాచ్ ల్లో ఆసీస్ ను మట్టికరిపించిన భారత్ సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది. ఆదివారం నాటి మ్యాచ్ లో అద్భుతం చేసిన హాకీ ఇండియా అదే ఆట తీరును కనబరిచి ఆస్ట్రేలియా ఆశలకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకు చుక్కెదురైంది. ఏ దశలోనూ అవకాశం ఇవ్వని హాకీ ఇండియా ఆటగాళ్లు తన సత్తాను మరోసారి రుచి చూపించి టైటిల్ ను ఎగురేసుకుపోయారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. -
భారత్... మళ్లీ సంచలనం
ప్రపంచ హాకీ చాంపియన్ ఆస్ట్రేలియాపై రెండో విజయం పెర్త్: రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్ గాయంతో ఆడకపోయినా... భారత హాకీ జట్టు మళ్లీ అద్భుతం చేసింది. నమ్మశక్యం కానీరీతిలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే వరుసగా రెండోసారి ఓడించి సంచలనం సృష్టించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-0తో ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించింది. ఆట 34వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ అందించిన పాస్‌ను ఎస్వీ సునీల్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టీమిండియా విజయాన్ని ఖాయం చేసుకుంది. కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన ‘డ్రాగ్ ఫ్లికర్’ రూపిందర్ పాల్ సింగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-0తో నెగ్గగా... రెండో మ్యాచ్‌లో భారత్ 2-1తో గెలిచింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడినా భారత్ సిరీస్‌ను కోల్పోదు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం... ఓవరాల్‌గా భారత్, ఆస్ట్రేలియాల మధ్య 105 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 18 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 71 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 16 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. జూనియర్ మహిళల జట్టుకు ఓటమి మరోవైపు న్యూజిలాండ్ జూనియర్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 0-5 గోల్స్ తేడాతో ఓడింది. ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.