భారీ విజయంతో వారియర్స్‌ బోణీ | HIL 2017: SV Sunil Stars in Punjab Warriors' 7-0 Win Over Ranchi Rays | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో వారియర్స్‌ బోణీ

Published Thu, Feb 2 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

HIL 2017: SV Sunil Stars in Punjab Warriors' 7-0 Win Over Ranchi Rays

రాంచీ: భారత స్టార్‌ ఫార్వర్డ్‌ ఎస్‌వీ సునీల్‌ మెరుపు ప్రదర్శనతో నాలుగు గోల్స్‌ సాధించడంతో... హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ వారియర్స్‌ బోణీ చేసింది. దబంగ్‌ ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 4–10తో ఓడిపోయిన పంబాబ్‌... బుధవారం రాంచీ రేస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7–0తో ఘనవిజయం సాధించింది. ఆట 25వ నిమిషంలో మింక్‌ వాన్‌డెర్‌ వీర్‌డెన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో వారియర్స్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్‌ 26వ నిమిషంలో, 34వ నిమిషంలో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ చేశాడు. హెచ్‌ఐఎల్‌ నిబంధనల ప్రకారం ఫీల్డ్‌ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో వారియర్స్‌ 5–0తో ముందంజ వేసింది. 43వ నిమిషంలో జేక్‌ వెటన్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించడంతో వారియర్స్‌ ఆధిక్యం 7–0కు పెరిగింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో దబంగ్‌ ముంబై తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement