ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు 4-3తో మలేసియాపై గెలుపొందింది.
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు 4-3తో మలేసియాపై గెలుపొందింది. జపాన్‌లోని కకమిగహరలో శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు మలక్ సింగ్ (41వ, 51వ ని.) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రమణ్‌దీప్ సింగ్ (4వ ని.), మన్‌దీప్ సింగ్ (54వ ని.) గోల్స్ చేశారు. మలేసియా తరఫున అజ్రీన్ రిజాల్ బిన్ నాసిర్ (10వ ని.), ఫైజల్ సారి (12వ, 67వ ని.) గోల్స్ చేశారు. ఐదు, ఆరు స్థానాల కోసం ఆదివారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... ఒమన్‌తో తలపడుతుంది.