భారత హాకీ జట్టుకు ఘనస్వాగతం
బెంగళూరు: చిరకాల శత్రువు పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా చాంపియన్స ట్రోఫీ నెగ్గిన భారత హాకీ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్, నికిన్ తిమ్మయ్య గత రాత్రి కౌలాలంపూర్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో అభిమానుల నుంచి భారీ ఆదరణ లభించింది. మరోవైపు ఈ విజయాన్ని ఉడీ ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబాలకు అంకితమిస్తున్నట్టు శ్రీజేష్ తెలిపాడు.
‘భారత సైనికులకు దీపావళి బహుమతిగా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. కచ్చితంగా వారు ఈ విజయాన్ని చూసి పొంగిపోరుు ఉంటారు. పాక్‌తో ఆడేటప్పుడు మాలో భావోద్వేగాలున్నా మ్యాచ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాం. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాం. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఓ డ్రా చేసుకున్న భారత జట్టు ఆసియా స్థారుులో అత్యంత పటిష్టంగా ఉంది’ అని శ్రీజేష్ పేర్కొన్నాడు.