
డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ... ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సునీత లాక్రా బృందం గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో 3–2 గోల్స్ తేడాతో మలేసియాపై విజయం సాధించింది. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 6–0 తో మలేసియాను మట్టికరిపించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఆధిపత్యం చలాయించింది.
భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (17వ ని.లో), వందన కటారియా (33వ ని.లో), లాల్‌రేమ్‌సియామి (40వ ని.లో) తలా ఓ గోల్ చేశారు. మలేసియా తరఫున నురైనీ రషీద్ (36వ ని.లో), హనీస్ (48వ ని.లో) చెరో గోల్ చేశారు. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య కొరియాతో భారత్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment