'బాహుబలి 2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్? | Deepika Padukone in Bahubali 2? | Sakshi
Sakshi News home page

'బాహుబలి 2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

Published Fri, Apr 1 2016 6:23 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'బాహుబలి 2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్? - Sakshi

'బాహుబలి 2' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

హైదరాబాద్:  తెలుగు సినీ చరిత్ర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన  ఘనత బాహుబలికే దక్కుతుంది.  స్వర్ణకమలాన్ని దక్కించుకుని  తనకంటూ ఓ  ప్రత్యేకమైన స్థానాన్ని  సంపాదించిన  బాహుబలికి సంబంధించి  మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం  బాలీవుడ్ పాపులర్ నటిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త వినిపిస్తోంది.  రాజమౌళి దర్శకత్వంలో  తెరకెక్కిన  ఈ మూవీకి సీక్వెల్  గా  రాబోతున్న 'బాహుబలి 2'  లో  బాజీరావు మస్తానీ  అమ్మడు దీపికా పదుకోన్ నటించనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.     

హిందీలో కూడా  భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ వుంటే, మార్కెట్ పరంగా మరింత బాగుంటుందనే అభిప్రాయాన్ని కరణ్ జోహార్ (ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేశాడు) వ్యక్తం చేశాడట. ఈ నేపథ్యంలోనే  బాహుబలికి  బాలీవుడ్ ఫ్లేవర్ జోడించనున్నట్టు సమాచారం.  పాత్ర చిన్నదే అయినా భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తూ నిర్మాతలు దీపికతో ఇప్పటికే చర్చలు జరిపారట.   మరో వైపు నుంచి ఈ సినిమా చేయమని ఆమెని కరణ్ జోహార్ కూడా బాగా ఒత్తిడి చేస్తున్నాడని  తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే బాహుబలి 2  లో  బాలీవుడ్ ముద్దుగుమ్మ హల్ చల్ చేయడం ఖాయం.

అయితే ఈ చిత్రంలో  దీపిక   పోషించనున్న పాత్రపై స్పష్టత లేదు. దీనిపై సస్పెన్స్ వీడాలంటే  చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. కాగా రికార్డులమీద  రికార్డులతో,  జాతీయ  ఉత్తమ చిత్రం పురస్కారాన్ని   సైతం సొంతం చేసుకున్న  బాహుబలి అందించిన విజయోత్సాహంతో రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement