నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దీపిక అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 8న రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో మెరిటోరియస్ అవార్డు అందుకోనున్నారు. జిల్లాలో క్లోరోహైడ్రేట్, గంజాయి నిందితులను పట్టుకోవడంలో దీపిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ మేరకు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లాలో కల్తీకల్లు, గుడుంబా అరికట్టడంలోనూ ఆమె పాత్ర ఉంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు నిర్మల్ జిల్లాలోనూ క్లోరోహైడ్రేడ్‌కు సంబంధించి 16 కేసులు నమోదు చేసి 23.58 కేజీల క్లోరోహైడ్రేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 58 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకుగాను ఎక్సైజ్‌శాఖ ప్రత్యేకంగా మహిళ దినోత్సవం పురస్కరించుకొని అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రెండుజిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది దీపికను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment