MERITORIOUS AWARD
-
ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. అప్లై చేయండి ఇలా..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద స్కాలర్షిప్స్ అందిస్తోంది. దీనిలో భాగంగా 2021–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు) అర్హతలు ► ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్స్‌లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ/ఓజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు అర్హులు. (ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5లక్షలకు మించకూడదు. ► వయసు: జులై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. స్కాలర్షిప్ ► ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48000 అంటే నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇందులో 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ అండ్ పోస్ట్ ద్వారా పంపాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► వెబ్సైట్: https://ongcscholar.org/#/ -
మెరిటోరియస్ అవార్డుకు దీపిక
నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దీపిక అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 8న రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో మెరిటోరియస్ అవార్డు అందుకోనున్నారు. జిల్లాలో క్లోరోహైడ్రేట్, గంజాయి నిందితులను పట్టుకోవడంలో దీపిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ మేరకు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లాలో కల్తీకల్లు, గుడుంబా అరికట్టడంలోనూ ఆమె పాత్ర ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు నిర్మల్ జిల్లాలోనూ క్లోరోహైడ్రేడ్కు సంబంధించి 16 కేసులు నమోదు చేసి 23.58 కేజీల క్లోరోహైడ్రేడ్ను స్వాధీనం చేసుకున్నారు. 58 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకుగాను ఎక్సైజ్‌శాఖ ప్రత్యేకంగా మహిళ దినోత్సవం పురస్కరించుకొని అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రెండుజిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది దీపికను ప్రత్యేకంగా అభినందించారు. -
రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ టెలివిజన్ నిర్మాత, రీసెర్చ్ స్కాలర్ రవి అయ్యగారిని వరించింది. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ డీ.పీ సింగ్ చేతుల మీదుగా రవికి ఈ అవార్డును బహూకరించారు. అన్లైన్లోనే బోధించడం, నేర్చుకోవడం అనే అంశంపై సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)లో వినూత్న అప్లికేషన్ని డెవలప్ చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో నామినేటెడ్ సభ్యుడు గా రవి కొనసాగుతున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో విజన్ 2020 ప్రాజెక్టులో కలిసి పని చేశారు.