రణ్‌వీర్‌తో కలిసి పెళ్లికెళ్లిన దీపికా పదుకొనే
బాజీరావు మస్తానీ చిత్రంతో ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్న దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌ల స్నేహం ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన తన స్నేహితురాలి వివాహానికి దీపికా.. తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌తో కలసి హాజరవ్వడం ఇప్పుడు అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి సందర్భంలో వారిద్దరూ కలసి దిగిన ఫొటో దీపికా అభిమాని ఒకరు ట్వీట్ చేసి, షేర్ కూడా చేశారు.
తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు దీపికా తల్లితో కలసి శ్రీలంక వెళ్లింది. సంజయ్ లీలా భన్సాలీ తీసిన రామ్‌లీలా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్న వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఎక్కడైనా ఇద్దరూ కలసే కనిపించడం వారిద్దరి స్నేహబంధాన్ని బలపరుస్తోంది. తాజాగా దీపికా ఫ్రెండ్ పెళ్లిలో ఇద్దరూ కలిసే కనిపించడం అందుకు మరింత ఊతాన్నిస్తోంది. దీపికా మొదటి హాలీవుడ్ సినిమా 'ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' షూటింగ్ జరుగుతుండగా ఓ చిన్న విరామంలో ఇండియాకు వచ్చింది.
నల్లని దుస్తులు ధరించిన దీపికా, ఆమె పక్కనే ఉజ్వలా పదుకొనే, రణ్‌వీర్ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో వాలెంటైన్స్ డే కోసం వీరిద్దరూ టొరొంటో వెళ్లారు.