Ranveer
-
అతి తెలివి కుర్రాళ్లు!
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్వీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్‌పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్‌బైసెప్స్ (రణ్వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్‌ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. హక్కులతో పాటే బాధ్యతలు అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది. -
వివాదాస్పద ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్
-
షారుక్ లేనిదే 'డాన్' లేదు.. ఇప్పుడేమో ఏకంగా!
‘మా డాన్ షారుక్ ఖాన్... వేరే ఎవర్నీ ఊహించలేం’ అంటూ మంగళవారం పలువురు షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అబిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. ‘డాన్, డాన్ 2’ తర్వాత రానున్న ‘డాన్ 3’లో షారుక్ నటించరన్న వార్త గుప్పుమనడంతో ‘‘షారుక్ ప్లేస్‌లో వేరే డాన్ని చూడలేం’’ అంటున్నారు ఫ్యాన్స్. మంగళవారం ఫర్హాన్ అక్తర్ చెప్పీ చెప్పనట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌తో ‘డాన్ 3’ అంశం పై చర్చ ఊపందుకుంది. ఆ వివరాల్లోకి వెళదాం.. హిందీ తెరపై డాన్ అంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన ‘డాన్’ (1978) సూపర్ డూపర్ హిట్టయింది. చంద్ర బారోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్ దాదాపు రూ 70 లక్షలు. కానీ వసూళ్లు రూ. 7 కోట్లు. అంటే.. పదింతల లాభం. డాన్‌గా అమితాబ్ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదే సినిమా తెలుగు రీమేక్ ‘యుగంధర్’ (1979)లో ఎన్టీఆర్, తమిళ రీమేక్ ‘బిల్లా’లో రజనీకాంత్ నటించారు. దక్షిణాదిన కూడా ఈ డాన్ సూపర్ హిట్. ది చేజ్ బిగిన్స్ ఎగైన్ అమితాబ్ బచ్చన్ డాన్ క్యారెక్టర్ అద్భుతంగా చేయడంతో ఇక డాన్ క్యారెక్టర్ అంటే ఆయనే అని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ ప్రేక్షకులు. అలాంటి తరుణంలో ‘నేను ఉన్నాను’ అంటూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత షారుక్ ఖాన్ డాన్‌గా తెరపైకి వచ్చారు. షారుక్ డాన్ రోల్లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) రూపొందింది. అమితాబ్ ‘డాన్’కి రీ బూట్ వెర్షన్‌లా ఫర్హాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయించారు. ఇక అమితాబ్ తర్వాతి తరంలో డాన్ అంటే షారుక్ అనేలా కింగ్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డాన్’ దాదాపు రూ. 105 కోట్ల వసూళ్లు రాబట్టి, సంచలన విజయం సాధించింది. ది కింగ్ ఈజ్ బ్యాక్ సిల్వర్ స్క్రీన్‌పై ఒక పాత్ర హిట్టయితే ఆ క్యారెక్టర్ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అమితాబ్ ‘డాన్’ తర్వాత మళ్లీ డాన్ క్యారెక్టర్ని చూడాలనుకున్నారు. షారుక్ ‘డాన్’గా వచ్చి, అలరించారు. ఈ హిట్ డాన్ని అలా వదిలేస్తే ఎలా? మళ్లీ ఈ పాత్ర చేయాలని షారుక్ అనుకున్నారు. డాన్ కోసం కథలు తయారు చేయించాలని ఫర్హాన్ కూడా ఫిక్స్ అయ్యారు. అలా ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ సెకండ్ వెర్షన్ ఆరంభించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ విడుదలైన ఐదేళ్లకు ‘డాన్ 2’ (2011)ని వెండితెరపైకి వదిలారు. ఇందులోనూ షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’కి రెండింతల బడ్జెట్.. అంటే దాదాపు రూ. 80 కోట్లతో రూ΄పొందించారు. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో రీబూట్ వెర్షన్లో వచ్చిన ఈ రెండో ‘డాన్’ కూడా ఘనవిజయం సాధించింది. ఫస్ట్ వెర్షన్‌కి ఫర్హాన్ దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కి కూడా ఫర్హాన్ ఈ రెండు బాధ్యతలు చేపట్టగా, షారుక్ నటించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘డాన్ 3’లో రణ్వీర్ సింగ్? ప్రేక్షకులు, షారుక్ అభిమానులు డాన్ క్యారెక్టర్ని మరచిపోలేదు. షారుక్ కూడా డాన్ పాత్రతో అనుబంధం పెంచుకున్నారు. ఫర్హాన్‌కి కూడా ఆ పాత్ర అంటే మక్కువ. అందుకే 2011లో ‘డాన్ 2’ని రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకూ ‘డాన్ 3’ గురించి ఏదో సందర్భంలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. ‘డాన్ 3’ కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలో మూడో వెర్షన్‌కి శ్రీకారం జరిగే అవకాశం ఉందని మంగళవారం ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ వీడియోలో ‘3’ అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డాన్’ థీమ్ మ్యూజిక్ వినబడుతోంది. అలాగే కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఉంది. సో... ‘డాన్ 3’ రానుందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఫర్హాన్ నటీనటులను ప్రకటించలేదు. దాంతో ఒకవేళ షారుక్ ఖాన్ అని ఫిక్స్ అయ్యుంటే.. ప్రకటించి ఉండేవారు కదా అనే చర్చ మొదలైంది. అలాగే కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సో.. థర్డ్ వెర్షన్లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పైగా ‘కొత్త శకం ఆరంభం కాబోతోంది’ అన్నారు కాబట్టి హీరోని మార్చే ఆలోచనలో ఫర్హాన్ ఉన్నారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ఫర్హాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేస్తే షారుక్ చేయాలి.. లేదా ఈ సిరీస్‌కి ఫుల్స్టాప్ పడాలన్నట్లుగా స్పందిస్తున్నారు. మరోవైపు రణ్వీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. షారుక్ మళ్లీ డాన్‌గా కనిపిస్తారా లేక రణ్వీర్ తెర మీదకు వస్తారా? ఒకవేళ రణ్వీర్ వస్తే.. అప్పట్లో అమితాబ్‌కి దీటుగా నటించి, డాన్‌గా భేష్ అని షారుక్ అనిపించుకున్నట్లే రణ్వీర్ కూడా ప్రేక్షకుల మెప్పు ΄పొందగలుగుతారా? వేచి చూడాల్సిందే. -
రణవీర్, అమితాబ్‌లతో తమన్నా
-
రణ్వీర్తో కలిసి పెళ్లికెళ్లిన దీపికా పదుకొనే
బాజీరావు మస్తానీ చిత్రంతో ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్న దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌ల స్నేహం ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన తన స్నేహితురాలి వివాహానికి దీపికా.. తన ప్రియుడు రణ్వీర్ సింగ్‌తో కలసి హాజరవ్వడం ఇప్పుడు అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి సందర్భంలో వారిద్దరూ కలసి దిగిన ఫొటో దీపికా అభిమాని ఒకరు ట్వీట్ చేసి, షేర్ కూడా చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు దీపికా తల్లితో కలసి శ్రీలంక వెళ్లింది. సంజయ్ లీలా భన్సాలీ తీసిన రామ్‌లీలా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్న వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఎక్కడైనా ఇద్దరూ కలసే కనిపించడం వారిద్దరి స్నేహబంధాన్ని బలపరుస్తోంది. తాజాగా దీపికా ఫ్రెండ్ పెళ్లిలో ఇద్దరూ కలిసే కనిపించడం అందుకు మరింత ఊతాన్నిస్తోంది. దీపికా మొదటి హాలీవుడ్ సినిమా 'ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' షూటింగ్ జరుగుతుండగా ఓ చిన్న విరామంలో ఇండియాకు వచ్చింది. నల్లని దుస్తులు ధరించిన దీపికా, ఆమె పక్కనే ఉజ్వలా పదుకొనే, రణ్వీర్ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో వాలెంటైన్స్ డే కోసం వీరిద్దరూ టొరొంటో వెళ్లారు. -
నా బయోపిక్‌లో అతను నటిస్తే బాగుంటుంది!
ముంబై: షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా ఇటీవల తన జీవితకథను ప్రచురించారు. తన మ్యానరిజం డైలాగ్ అయిన 'ఖామోష్' అనే పదాన్ని తన జీవితకథకు టైటిల్‌గా పెట్టారు. ఇక తన జీవితకథ ఆధారంగా సినిమా వస్తే అందులో 'బాజీరావు మస్తానీ' స్టార్ రణ్‌వీర్‌సింగ్ తనలాగా నటిస్తే బాగుంటుందని ఆయన మనస్సులోని మాట వెల్లడించారు. 'నిజంగా నా జీవితం ఆధారంగా తీసే సినిమా మంచి కథ అవుతుంది. స్ఫూర్తినిచ్చే గొప్ప సినిమాగా నిలిచే అవకాశముంది. ఈ కథలో రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్నీ ఉంటాయి. హీందీలో నా జీవితకథను సినిమాగా తీస్తే అందులో రణ్‌వీర్‌సింగ్ నటిస్తే బాగుంటుంది. లేకపోతే అచ్చు నాలాగే ఉండే నా కొడుకులు లవ్, కుష్ ఈ పాత్ర వేసినా బాగుంటుంది. నేను కూడా ఈ సినిమాలో ఏదో ఒక పాత్ర వేస్తాను' అని ఆయన విలేకరులతో అన్నారు. బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అయిన శత్రుఘ్న జీవితకథను 'ఎనిథింగ్ బట్ ఖామోష్: ద శత్రుఘ్నసిన్హా బయోగ్రఫీ' పేరిట రచయిత భారతి ఎస్ ప్రధాన్ రచించారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 19న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు.