ఇంటి పెద్ద అనారోగ్యంతో మంచం పట్టాడు.ఐదుగురు వ్యక్తులు ఉన్న ఆ ఇల్లు నిలబడాలంటే ఇంటి ఇల్లాలు ఏదో ఒక పని వెతుక్కోవాలి. గృహిణిగా ఇంటి పనులు చేయగలగడం తప్ప మరే నైపుణ్యాలు లేవు.అలాంటి దిక్కుతోచని వాతావరణం నుంచి దీపికా మహత్రే ఓ కొత్త మార్గంవైపు నడిచింది.భర్త, ముగ్గురు పిల్లల పోషణ కోసం ఇళ్లలో పనిమనిషిగా చేరింది. ముంబయ్ లోకల్ రైళ్లలో ఇమిటేషన్ జ్యువెలరీని అమ్మేది. అక్కడ నుంచి స్టాండ్ అప్ కమెడియన్‌గా ఆమె జీవితం ఓ గొప్ప మలుపు తీసుకుంది. వెబ్ సిరీస్‌లో నటించే అవకాశంపోందింది. పనిమనిషి నుంచి స్టాండ్ అప్ కమెడియన్‌గా ఎదిగిన ఆమె కథ ఎంతో మంది జీవితాలను ఉత్సాహపరుస్తుంది.
‘‘నా భర్త ఆరోగ్యం బాగోలేనప్పుడు ఐదుగురు సభ్యులతో కూడిన నా కుటుంబానికి ఏకైక జీవనో΄ాధిని అయ్యాను. మా ్ర΄ాథమిక అవసరాలు తీర్చడానికి ఊరగాయలు, ΄ాపడ్‌లను అమ్మడం మొదలు పెట్టాను. పేషెంట్ కేర్ సర్వీస్‌లో పనిచేశాను. ఐదు ఇళ్లలో వంటపని చేయడం ్ర΄ారంభించాను. అంతేకాదు, ముంబై లోకల్ ట్రైన్‌లో ఇమిటేషన్ జ్యువెలరీని అమ్మడం ్ర΄ారంభించాను. ఇన్ని పనులు చేయడం కష్టమయ్యేది. కానీ, కష్టసమయాల్లో నా కుటుంబాన్ని నిలబెట్టాలి, నా పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి. ఈ తపనతోనే అన్ని పనులూ ఓర్పుగా చేసేదాన్ని.
మలుపు తిప్పిన కామెడీ..
అయితే, అన్ని పనుల్లో ఒక ప్రత్యేకత ఉందన్న విషయం నాకే తెలియదు. నలుగురిని నవ్విస్తూ, సరదాగా మాట్లాడుతుంటాను. నేను పనిచేసేచోట యజమాని ఫ్రెండ్ ఒకరు నా టాలెంట్‌ను ప్రదర్శించమని ్ర΄ోత్సహించాడు. సంపన్నుల కుటుంబాల్లో వ్యక్తుల ద్వంద్వ ప్రమాణాలను ఎగతాళి చేస్తూ, నేను గమనించిన అసమానతలను హాస్యంగా హైలైట్ చేస్తూ చె΄్పాను. చాలా మెచ్చుకున్నారు. కామెడీ అనేది ఒక అద్దంలా పనిచేస్తుంది, మార్పును కలిగిస్తుంది. ఒక రి΄ోర్టర్ నా వినోద భరితమైన స్టోరీని పత్రికలో వేశారు. హాస్యనటుడు అదితి మిట్టల్ నా స్టోరీ చూసి, నన్ను కలవడానికి వచ్చారు. నా కామెడినీ కొనసాగించమని ్ర΄ోత్సహించారు. నేను దానిని అనుసరించాను.
పరిశీలనే కంటెంట్..
నాలాంటి మహిళలకు ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. వేదికపైన అందరి దృష్టిని ఆకర్షించాలంటే నాదైన ప్రత్యేకత చూపించాలి. నేను ఎక్కడ పనిచేసినా ఆ ఇంటి యజమానుల పనులను గమనించేదాన్ని. అదే నా కంటెంట్‌గా మారింది. నాలాగా పని చేస్తున్నవారు ఎదుర్కొంటున్న వాస్తవాలను వెలుగులోకి తేవడం మొదలుపెట్టాను. పనిమనిషికి కూర్చునేందుకు ఎక్కడా సరైన స్థలం కూడా ఉండదు. ఎంత కష్టంగా అనిపించినా అన్నీ పెదవి చాటున బిగపట్టుకొని పనులు చేస్తూ ఉండాలి. నా పరిశీలనలే నా హాస్య కచేరీలకు సరైన కథనాలను అందించాయి. వెబ్‌సీరీస్ ‘బ్యాడ్ గర్ల్’ వంటి ్ర΄ాజెక్ట్‌లలో కూడా ΄ాల్గొన్నాను. సామాజిక అసమానతలను హాస్యంలో మేళవించి నిర్భయంగా ప్రస్తావిస్తూ రావడంతో ΄ాల్గొన్న వేదికలన్నీ వినోదానికే కాదు న్యాయం వైపుగా కూడా ఆలోచింపజేసేవి.
పెరిగిన ఆదరణ
జనాదరణ పెరగడంతో టెలివిజన్ ఛానెల్స్ నుండి ఆఫర్లు రావడం పెరిగాయి. పేరు, డబ్బు రావడంతో కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంది. ‘స్మైల్ ఈజ్ మై సూపర్ పవర్’ అని నమ్మకంగా చెబుతాను. ఎందుకంటే, నా జీవితంలో ఒడిదొడుకులను చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నాను. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే నమ్మకాన్ని ఏ ఒక్కరూ కోల్పోనక్కర్లేదు. అందుకు వయసుతో, పరిస్థితులతో కూడా సంబంధం లేదు.
ఇప్పుడు నేను నడివయసు మహిళను. ఎవరైనా సరే 40, 50 లేదా వందేళ్లయినా సరే జీవితం పట్ల అభిరుచిని కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం వృద్ధా΄్యానికి దగ్గర కావచ్చు. కానీ, మనలో ఎప్పటికీ ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆమె ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉంటుంది. మనం కూడా అలాగే ఉండాలి. ఏదైనా సమస్య మన తలుపు తడితే భయపడకుండా, విచారంగా లేకుండా చిరునవ్వుతో స్వాగతించాలి. ఎలాంటి సవాళ్లు వచ్చినా సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడం మొదలుపెడితే మన మార్గం కూడా సులువు అవుతుంది.
స్టాండ్ అప్ కామెడీ పురుష ఆధిపత్య ప్రపంచానిదే. అలాంటి రంగంలో నాకంటూ ఓ సముచిత స్థానాన్ని సం΄ాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నిరాశావాదంతో కొట్టుమిట్టాడేవారికి నా జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. దానిని వెలికి తీసేందుకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తూనే ఉండాలి’ అంటోంది ఈ స్టాండప్ కమెడియన్.
Comments
Please login to add a commentAdd a comment