ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'బాజీరావ్ మస్తానీ'లో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకొనె ఈ సినిమా విడుదల పై స్పందించింది. ఈ ఏడాది డిసెంబర్ 18న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు షారూఖ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'దిల్వాలే' నుంచి బిగ్ఫైట్ ఎదురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్లాష్ పై స్పందించిన దీపిక ఇదేమంత పెద్ద విషయం కాదంటూ కొట్టిపారేసింది. బాజీరావ్ మస్తానీ, దిల్వాలే రెండు డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలని, ఏ విషయంలోనే ఈ రెండు సినిమాలకు పోలికే లేదని, దాంతో ఏ విషయంలోనూ ఈ రెండు సినిమాలు పోటీ కావంటూ తేల్చేసింది.
బాజీరావ్ మస్తానీ సినిమాను సంజయ్ లీలా బన్సాలీ పీరియాడిక్ జానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా రణవీర్ సింగ్, దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రాలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక లాంగ్ గ్యాప్ తరువాత బాలీవుడ్ హాట్ కపుల్ షారూక్ ఖాన్, కాజోల్ లు కలిసి నటిస్తున్న దిల్ వాలే సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలోయువజంట వరుణ్ దావన్, కృతి సనన్ లు కూడా నటిస్తుండటంతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
షారూఖ్ సినిమా పోటీనే కాదు: దీపిక
Published Wed, Sep 16 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement