యాక్షన్‌.. థ్రిల్‌ | Gopichand Malineni Launched 7:11 PM Movie Teaser release | Sakshi
Sakshi News home page

యాక్షన్‌.. థ్రిల్‌

Published Thu, Jun 8 2023 5:55 AM | Last Updated on Thu, Jun 8 2023 5:55 AM

Gopichand Malineni Launched 7:11 PM Movie Teaser release - Sakshi

సాహస్, దీపికా ముఖ్య తారలుగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘7:11’. నూతన నటీనటులతో చైతు మాదాలను   దర్శకుడిగా పరిచయం చేస్తూ నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం  టీజర్‌ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మాట్లాడుతూ– ‘‘మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం హంసలదీవి అనే చిన్న ఇండియన్‌ టౌన్‌కి చేరుకుంటారు ఏలియన్లు.

అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌ను రాత్రి 7:11 లోపు డీయాక్టివేట్‌ చేయాలి. గడువు కంటే ముందే అతను మిస్టరీని ఛేదించాలి.. లేదంటే కార్డియాక్‌ అరెస్ట్‌తో అతని గుండె ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: జ్ఞాని, కెమెరా: శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement