
ఉప్పల్(హైదరాబాద్): టిక్‌టాక్‌తోపాటు వీడియో గేమ్‌లు ఆడవద్దన్నందుకు మనస్తాపం చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రా మంతాపూర్ అరవింద్ కాలనీ వీధి–2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్‌వేర్ వర్క్‌షాపు నిర్వాహకు డు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్ మొదటి ఏడాది చదువుతోంది. తరచూ ఫోన్‌లో టిక్‌టాక్‌లు చూస్తూ, వీడి యోగేమ్‌లు ఆడుతూ సమయం వృథా చేస్తుండటం తో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దీపిక గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment