నిషా అగర్వాల్‌ న్యూ స్టైలిష్‌ లుక్‌.. వీటి ధర తెలుసా.. | Nisha Agarwals Latest Stylish Look With Jayanti Reddy Lehenga And Jaipur Juwellary | Sakshi
Sakshi News home page

నిషా అగర్వాల్‌ న్యూ స్టైలిష్‌ లుక్‌.. వీటి ధర తెలుసా..

Published Sun, Oct 10 2021 10:43 AM | Last Updated on Sun, Oct 10 2021 1:20 PM

Nisha Agarwals Latest Stylish Look With Jayanti Reddy Lehenga And Jaipur Juwellary - Sakshi

‘ ఏమైంది ఈ వేళ ’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిషా అగర్వాల్‌. ఆమెకు నప్పే ఆహార్యాన్ని అందించి ఆమె అందాన్ని మరింత ఇనుమడింప చేసిన ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే..

జయంతి రెడ్డి.. 
హైదరాబాద్‌కు చెందిన జయంతి.. బిజినెస్‌ కోర్సు చేసింది, కానీ ఆమె ప్యాషన్‌ మొత్తం ఫ్యాషన్‌పైనే. ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి, 2011లో తన పేరు మీదే ఓ ప్యాషన్‌ హౌస్‌ ప్రారంభించింది. చేతితో చేసే అల్లికలకే  ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి ఆమె డిజైన్స్‌. శుభకార్యాల కోసం, ముందుగానే డిజైన్స్‌ బుక్‌ చేసుకోవాలి. 2015 లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ‘హల్దీ కుంకుమ్‌’ కలెక్షన్స్‌తో సెలబ్రిటీ డిజైనర్‌గా ఎదిగింది. చాలామంది సెలబ్రిటీస్‌కు తన డిజైన్స్‌ అందించింది. డిజైనర్‌ పీస్‌ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ బ్రాండ్‌ డిజైన్స్‌ లభిస్తాయి. 

డ్రెస్‌ డిజైనర్‌: జయంతి రెడ్డి 
ధర:రూ. 2,89,900

డ్యూయెట్‌ లగ్జరీ.. 
లెదర్‌–వుడ్‌ స్పెషలిస్ట్‌ ఈ బ్రాండ్‌. నాణ్యమైన టేకు కలపకు ప్యూర్‌ లెదర్‌ జోడించి వివిధ అలంకరణ సామాగ్రిని తయారు చేస్తారు. వీటిల్లో బ్యాగులు, బెల్టులు చాలా ఫేమస్‌. ఇక లెదర్‌ ఐటమ్స్‌పై అందించే యూనిక్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఈ బ్రాండ్‌ వాల్యూను అమాంతం పెంచేశాయి. మెటల్‌ ఐటమ్స్‌ డిజైన్స్‌లోనూ దీనికి మంచి పేరుంది. ఆ ఫేమ్‌కు తగ్గట్టు వీటి ఖరీదూ ఎక్కువే. పలు ప్రముఖ ఆన్‌ లైన్‌ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. 

ఫుట్‌వేర్‌ బ్రాండ్‌: డ్యూయెట్‌ లగ్జరీ 
ధర: రూ. 13,000

జైపూర్‌ జ్యూయెల్స్‌.. 
ఏడుతరాల చరిత్ర కలిగిన జైపూర్‌ జ్యూయెల్స్‌.. సుమారు 150 సంవత్సరాల కిందటిది. అప్పట్లో ఇది రాజకుటుంబీకులకు బంగారు ఆభరణాలను అందించేది. అయితే, అధికారికంగా మిలాప్‌చంద్‌ నహతా 1966లో ‘జైపూర్‌ జ్యూయెల్స్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అతని కుమారుడు సుభాష్‌ నహతా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. రాయల్‌ జ్యూయెలరీ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. అందుకే, ఎక్కువగా సెలబ్రిటీస్‌ పెళ్లిళ్లలో ఈ జైపూర్‌ జ్యూయెల్స్‌ మెరుస్తాయి. కేవలం డిజైన్‌ అధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. జైపూర్, ముంబై, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో వీరి బ్రాంచీలు ఉన్నాయి. అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.  
చిన్నప్పుడు మొత్తం అక్కే నన్ను రెడీ చేసేది.

జ్యూయెలరీ బ్రాండ్‌: జైపూర్‌ జ్యూయెల్స్‌ 
ధర: డిజైన్‌ పై ఆధారపడి ఉంటుంది. 

- దీపిక కొండి

చదవండి: డార్క్‌ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement