Nisha Agarwal
-
స్టార్ హీరోయిన్ చెల్లి.. తెలుగులో హిట్ సినిమాలు.. చివరకు పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
గోవా బీచ్‌లో నేహా.. సంగీత్కి రకుల్ రెడీ..‘చిట్టి’ బ్లాక్&వైట్ స్టిల్స్
► సిస్టర్ పిక్ అంటూ అక్క కాజల్ అగర్వాల్‌తో కలిసి దిగిన ఫోటోని నిషా అగర్వాల్ తన అభిమానులతో పంచుకుంది ► రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై సంగీత్కి వెళ్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ ► బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ &వైట్ పిక్ షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా ► మెగాస్టార్ ఇంట క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయింది. ఈ వేడుకలో మెగాహీరోలంతా పాల్గొన్నారు. ఆ ఫోటోని వరుణ్తోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు ► గోవాలో సేద తీరుతున్న నేహాశర్మ View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
నిషా అగర్వాల్ న్యూ స్టైలిష్ లుక్.. వీటి ధర తెలుసా..
‘ ఏమైంది ఈ వేళ ’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిషా అగర్వాల్. ఆమెకు నప్పే ఆహార్యాన్ని అందించి ఆమె అందాన్ని మరింత ఇనుమడింప చేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. జయంతి రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన జయంతి.. బిజినెస్ కోర్సు చేసింది, కానీ ఆమె ప్యాషన్ మొత్తం ఫ్యాషన్‌పైనే. ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, 2011లో తన పేరు మీదే ఓ ప్యాషన్ హౌస్ ప్రారంభించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి ఆమె డిజైన్స్. శుభకార్యాల కోసం, ముందుగానే డిజైన్స్ బుక్ చేసుకోవాలి. 2015 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ‘హల్దీ కుంకుమ్’ కలెక్షన్స్‌తో సెలబ్రిటీ డిజైనర్‌గా ఎదిగింది. చాలామంది సెలబ్రిటీస్‌కు తన డిజైన్స్ అందించింది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్: జయంతి రెడ్డి ధర:రూ. 2,89,900 డ్యూయెట్ లగ్జరీ.. లెదర్–వుడ్ స్పెషలిస్ట్ ఈ బ్రాండ్. నాణ్యమైన టేకు కలపకు ప్యూర్ లెదర్ జోడించి వివిధ అలంకరణ సామాగ్రిని తయారు చేస్తారు. వీటిల్లో బ్యాగులు, బెల్టులు చాలా ఫేమస్. ఇక లెదర్ ఐటమ్స్‌పై అందించే యూనిక్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఈ బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేశాయి. మెటల్ ఐటమ్స్ డిజైన్స్‌లోనూ దీనికి మంచి పేరుంది. ఆ ఫేమ్‌కు తగ్గట్టు వీటి ఖరీదూ ఎక్కువే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. ఫుట్‌వేర్ బ్రాండ్: డ్యూయెట్ లగ్జరీ ధర: రూ. 13,000 జైపూర్ జ్యూయెల్స్.. ఏడుతరాల చరిత్ర కలిగిన జైపూర్ జ్యూయెల్స్.. సుమారు 150 సంవత్సరాల కిందటిది. అప్పట్లో ఇది రాజకుటుంబీకులకు బంగారు ఆభరణాలను అందించేది. అయితే, అధికారికంగా మిలాప్‌చంద్ నహతా 1966లో ‘జైపూర్ జ్యూయెల్స్’ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అతని కుమారుడు సుభాష్ నహతా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. రాయల్ జ్యూయెలరీ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. అందుకే, ఎక్కువగా సెలబ్రిటీస్ పెళ్లిళ్లలో ఈ జైపూర్ జ్యూయెల్స్ మెరుస్తాయి. కేవలం డిజైన్ అధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. జైపూర్, ముంబై, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో వీరి బ్రాంచీలు ఉన్నాయి. అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. చిన్నప్పుడు మొత్తం అక్కే నన్ను రెడీ చేసేది. జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జ్యూయెల్స్ ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే.. -
హ్యాపీ కర్వాచౌత్ గౌతం: కాజల్
కోవిడ్ మహమ్మారి కారణంగా హంగు, ఆర్భాటాలు లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అక్టోబర్ 30న ముంబైలోని ప్లష్ హోటల్లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ కూడా తమ పెళ్లి వేడుకను అద్భుతంగా, కన్నులపండుగగా చేసుకున్నా కూడా దానికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ముహూర్తం ఖరారైన నాటి నుంచి వధూవరుల ఇళ్లు వేడుకలకు కొలువైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఈ కొత్తజంట కర్వా చౌత్ పండుగ చేసుకోవడంలో నిమగ్నమైంది. భర్త బాగుండాలని భార్య చేసే పూజ ఇది. కార్తిక మాసంలోని పౌర్ణమి తర్వాత నాలుగు రోజులకు వచ్చే ఈ పండుగను ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. (చదవండి: కాజల్ నో చెప్పింది ఇందుకే..) కాగా కాజల్ జరుపుకుంటున్న మొదటి కర్వా చౌత్ ఇదే కావడంతో ఆమె ఆనందం రెట్టింపైంది. బావ చేతికి మెహెందీ పెడుతున్న నిషా అగర్వాల్, తన పక్కనే కూర్చుని, నవ్వులు చిందిస్తున్న కాజల్ అగర్వాల్ ఫోటో సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది. కాజల్ ఎరుపు రంగు చీరలో, అదే రంగు మాస్క్‌తో తళుక్కుమంటున్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో గోరింటాకు పెట్టుకున్న అయిదు చేతులను చూపిస్తూ ‘‘ఎవరు ఎవరో కనిపెట్టండి’’ అంటూ ఫాలోవర్స్‌ను ఆటపట్టించారు. పెళ్లి తర్వాత ముంబాయిలోని కొత్త ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకున్న కాజల్, గౌతమ్ జంట ఇటీవల ఆ ఇంటికి గృహప్రవేశ వేడుక కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘కొత్త ప్రారంభాలకు శ్రీకారం. నా భార్యతో మా కొత్త ఇంట్లో..’’ అంటూ పోస్ట్ చేశారు. -
మరో రెండు ఫోటోలు, కాజల్ ఫ్యాన్స్‌కు పండగే
హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత శుక్రవారం ఎంతో కాలంగా తాను ప్రేమిస్తున్న గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈరోజు మరో రెండు ఫోటోలను కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. View this post on Instagram As you begin this new journey in life, let it be fantastic, crazy, wonderful, unbelievable and unforgettable. May your life together be full of love and your love full of life. ❤️❤️❤️ @kajalaggarwalofficial @kitchlug #kajgautkitched A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Nov 1, 2020 at 6:34pm PST నిషా షేర్ చేసిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో నవ దంపతులిద్దరు ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్ షేర్ చేసిన ఫొటోలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ మాస్క్ పెట్టుకొని ఉంది. గౌతమ్ కిచ్లు వైట్ కలర్ షేర్వాణి ధరించి వైట్ కలర్ మాస్క్ ధరించాడు. ఈ ఫొటోలు చూసిన అభిమానులందరూ కాజల్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని ఫొటోల కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. View this post on Instagram @manishmalhotraworld @manishmalhotra05 Jewellery : @manishmalhotrajewellery Stylist: @stylebyami Style team : @tanyamehta27 Hair : @divya.naik25 Photo: @storiesbyjosephradhik A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 1, 2020 at 7:23pm PST చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్... -
సినిమా జీవితానికి దూరం కావడానికి రెడీ..
తమిళసినిమా: కుటుంబం కోసం ఎందాకైనా రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో అగ్రనాయకిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీకిప్పుడు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు ప్యారీస్ ప్యారీస్ చిత్రం మాత్రమే చేతిలో ఉంది. టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోల చిత్రాలేవీ లేవు. దీంతో పెళ్లికి సిద్ధం అవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే కాజల్ మైండ్ సెట్ మారినట్లు ఆమె మాటల ద్వారా అనిపిస్తోంది. ఇంతకీ కాజల్‌అగర్వాల్ ఏమంటుందో చూద్దాం. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం పోతే మళ్లీ దొరుకుతుంది. అయితే కుటుంబ సంబంధాలను ఒక్కసారి కోల్పోతే మళ్లీ పొందడం కష్టం. నిజ జీవితంలో నేను భావోద్వేగాలకు లోనవుతాను. కుటుంబ సభ్యులతో ఎలా నడుచుకోవాలి. ఎలా గౌరవించాలి అన్నది నాకు అనుభవం. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. సినిమా జీవితానికి దూరం కావడానికి రెడీ. నేటి తరం జీవితాల్లో వేగం పెరిగింది. కుటుంబ అనుబంధాల గురించి తెలిసినా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. అందుకు కారణాల గురించి ఆలోచించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎందుకు విడిపోయాం అన్న విషయం గురించి కొంచెం ఆలోచిస్తే, ఇంత చిన్న విషయం గురించా విడిపోయామా అని అనిపిస్తుంది. మళ్లీ కలుసుకుంటాం. డబ్బు కంటే మనుషులు ముఖ్యం. వారిని గౌరవించండి అని అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఇంతకీ సడన్‌గా ఇలా అనుబంధాల గురించి ఉపోద్ఘాతం ఏమిటీ? ఈ అమ్మడి మాటల్లో గూడార్ధం ఏమై ఉంటుందీ? అని అలోచన్లో పడ్డారా? అయితే ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది. -
తల్లి అయిన మాజీ హీరోయిన్!
‘ఏమైంది ఈ వేళ’, ‘సోలో’ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన నిషా అగర్వాల్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో నిషా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక కాజల్ అగర్వాల్ ఆ బాబుని ముద్దాడుతూ దిగిన ఓ ఫోటోని తన ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో పాటు నిషా కొడుకు పేరు ‘ఇషాన్ వాలేదా’ అని అందరికి పరిచయం చేసింది. నిషా కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ తన అక్కలాగా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఆమె నటించిన ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి సినిమాల్లో నటించింది. అనంతరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్‌ను నిషా 2013లో పెళ్లి చేసుకుంది. నిషా పెళ్ళి అయిన తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల ‘అ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ కళ్యాణ్ రామ్‌కి జంటగా ‘ఎంఎల్ఏ’ సినిమాలో నటిస్తుంది. The force awakens (at all hours of the night). Meet our new little jedi *Ishaan Valecha* 😻 @AggNisha @_karanvalecha_ so much love ❤️ pic.twitter.com/5uDvoIdQUh — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 21, 2018 -
పెళ్లా.. ఇప్పుడా!
ఇదిగో అమ్మాయ్! పెళ్లెప్పుడు? ఇప్పుడు నీ వయసెంతో తెలుస్తుందా?... పెళ్లీడు దాటిన ప్రతి అమ్మాయికి ఏదొక టైమ్‌లో ఇంచు మించు ఇటువంటి ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. చుట్టాలో... చుట్టుపక్కల వాళ్లో... ఎవరొకరు అడుగుతారు. వాళ్లందరికీ ఏదొకటి చెప్పి తప్పించుకోవచ్చు లేదా ‘నీకెందుకు?’ అని ఎదురు తిరగొచ్చు. అదే ఇంట్లోవాళ్లు అడిగితే? సమాధానం చెప్పడం కొంచెం కష్టమే కదూ! సరిగ్గా ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారు కాజల్ అగర్వాల్. వచ్చే నెలాఖరుకు కాజల్ సిస్టర్ నిషాకు పెళ్లై నాలుగేళ్లు! నిషా పెళ్లి టైమ్‌లో అడిగిన వాళ్లకు ‘చెల్లికి నచ్చిన అబ్బాయి దొరికాడు. పెళ్లి చేసుకుంది. నా పెళ్లికి ఇంకా బోల్డంత టైముంది’ అని కాజల్ క్లారిటీ ఇచ్చారు. అయితే... ఇప్పుడామె తల్లిదండ్రులే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారట! కాజల్ అంత త్వరగా ఒప్పుకోలేదులెండి! ‘‘ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. నేను మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నా. అందుకే, నా దగ్గరకు వచ్చిన కథల్లోంచి నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటున్నా. కొన్నేళ్లు సినిమాల్లో కొనసాగుతా’’ అని తల్లిదండ్రులకు చెప్పేశానని కాజల్ తెలిపారు. ఇప్పుడు కాజల్‌కి 32 ఏళ్లు. కానీ, అంత వయసున్నట్టు కనిపిస్తుందా? సో... ఈజీగా ఇంకో ఐదారేళ్లు సినిమాలు చేస్తారేమో!! -
అందుకు మరి కొంతకాలం ఆగాల్సిందే!
సెలబ్రిటీ తారలకు వ్యక్తిగతంగా ఎక్కువగా చిక్కొచ్చేదెక్కడంటే వివాహం విషయంలోనే. దీనికి వేరే అర్థాలు తీసేరు.ఇక్కడ చెప్పేదేమంటే ప్రముఖ నాయికల మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా పెళ్లి వార్తలు తెరపై కొచ్చి హల్చల్ చేస్తుంటాయి. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే నటి కాజల్‌అగర్వాల్ కూడా దీన్ని ఎదుర్కోకతప్పలేదు. మరో విషయం ఏమిటంటే ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగి తేలుతుండడంతో కాజల్‌కు ఈ బెడద ఎక్కువైందనే చెప్పాలి. ఈ ఉత్తరాది బ్యూటీ ముంబైకి చెందిన ఒక వ్యాపార వేత్త ప్రేమలో పడ్డారనే ప్రచారం ఆ మధ్య గుప్పుమంది. ఆయనతో త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం హోరెత్తింది. అందుకు పూజలు, పరిహారాలు చేసినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ విషయాలపై కాజల్ రియాక్ట్ అవ్వకపోయినా ఆమె చెల్లెలు ఖండించడానికి తంటాలు పడ్డారు. కొంత కాలం కాజల్ పెళ్లి ప్రచారం సద్దుమణిగినా ఇటీవల మళ్లీ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఐదారు చిత్రాలు చేతిలో ఉండడంతో కాజల్ పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీని గురించి స్పందించిన కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుండడంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ తరుణం తన కోసం మరి కొంత కాలం ఆగాల్సిందేనని కాజల్ పేర్కొన్నారు. -
అది మాత్రం అడగొద్దు
తనను కలిసిన వారిని కాజల్ కోరుతున్న దొక్కటే అది మాత్రం అడగొద్దు అని. ఇంతకీ ఈమె బాధ ఏమిటో చాలామందికి అర్థమయ్యే వుంటుంది. విజయం కోసం తొలి రోజుల్లో పోరాడిన ఈ చందమామ, మగధీర చిత్రంతో తెలుగులోను, తుపాకీ చిత్రంతో తమిళంలోను ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ప్రస్తుతం దక్షిణాదిలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్న ఈ బ్యూటీ నటిగా దశాబ్దం పూర్తి చేసుకుంది. అంతేకాకుండా చెల్లెలు నిషా అగర్వాల్ కొన్ని చిత్రాల్లో నటించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవడంతో అక్క కాజల్ అగర్వాల్ పెళ్లి ఎప్పుడన్న విషయం గురించే అందరూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నల పరంపరలతో విసిగిపోయిన కాజల్ ఆ ఒక్కటి అడగొద్దు బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది. దీని గురించి కాజల్ ఏమంటుందో చూద్దాం. కొంతకాలంగా నేను ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న పెళ్లెప్పుడన్నదే. అయినా పెళ్లికి అంత తొందరేముంది. నేనింకా సినిమాను, నటననే ప్రేమిస్తున్నాను. ఇక్కడ సాధించాల్సింది చాలా ఉంది. మరో విషయం ఏమిటంటే నేనిప్పటి వరకు అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోలేదు. వెతుక్కుంటూ వచ్చే అవకాశాల్లోనే నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. పదేళ్లుగా అదే చేస్తున్నాను. ఎలాంటి పాత్రలు అంగీకరించాలో తెలుసుకునే స్థితికి నేను ఎదిగాననుకుంటున్నాను. అయినా ఇప్పటికీ కెమెరాముందుకు వెళ్లగానే ధ్యానంలోకి వెళ్లిన భావనే కలుగుతుంది. ఇతరుల కంటే నన్ను నేను ప్రత్యేకంగా కూడా ఫీలవుతుంటాను. అదే విధంగా నన్ను అడిగితే ప్రపంచ ంలో అన్నింటికంటే సినిమానే ఉత్తమ వృత్తి అన్నది నా అభిప్రాయం. అంతగా సినిమాను ప్రేమిస్తున్నాను. ఇక పెళ్లి అంటారా సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటున్న కాజల్ ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన మారి చిత్రం, సుశీందర్ దర్శకత్వంలో విశాల్ సరసన నటిస్తోంది. -
అక్కలా ఆరబోయలేను
అక్క మాదిరిగా అందాలారబోయడం తన వల్ల కాదంటోంది నటి నిషా అగర్వాల్. ఈ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోదరి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్క మాదిరిగానే ఈ అమ్మడు దక్షిణాది భాషల్లో హీరోయిన్గా ఎదగాలని ఆశి స్తోంది. నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిం చింది. కోలీవుడ్‌లో ఇష్టం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఈ భామ అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు దాంపత్య జీవితంలో మునిగి తేలింది. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించింది. పస్తుతం మలయాళంలో భాగ్య భాగ్య అనే చిత్రంలోను తెలుగులో డీకే బోస్ చిత్రంలోను నటిస్తోంది. తమిళంలోను అవకాశాల వేట మొదలెట్టింది. ‘‘మీ అక్క కాజల్ అగర్వాల్ మాదిరి గ్లామరస్‌గా నటిస్తారా?’’ అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ అక్క మాదిరి అందాలారబోత తన వల్ల కా దని ఖరాఖండిగా చెప్పింది. అలాంటి పాత్రలు తన శారీరక భాషకు నప్పవని అంది. నిజం చెప్పాలంటే గ్లామరస్ పాత్రలో నటించడం తనకు సౌకర్యంగా ఉండదని చెప్పింది. అలా అంటే అవకాశాలెలా వస్తాయమ్మా అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి ఈ వివాహిత రీ ఎంట్రీలో ఎలా రాణిస్తుం దో వేచి చూద్దాం. -
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిషా
-
నా పెళ్లికి చాలా టైముంది!
చెల్లి పెళ్లి వార్త ఏ ముహూర్తాన బయటకొచ్చిందో... అక్కడ్నుంచీ కాజల్ అగర్వాల్‌కి కష్టాలు మొదలయ్యాయి. త్వరలో కాజల్ కూడా పెళ్లి పీటలెక్కేయనున్నారని, సాధ్యమైనంతవరకూ నిషా పెళ్లికి ముందే కాజల్ పెళ్లి జరిగిపోతోందని కొన్ని అనధికార సైట్లలో కథనాలు కనిపిస్తున్నాయి. దాంతో విసిగిపోయిన కాజల్ దీనికి వివరణ ఇచ్చారు. ‘‘నిషా ప్రేమించింది. పెళ్లి చేసుకుంటుంది. అది ఆమె సొంత విషయం. ఆ పెళ్లితో నా పెళ్లిని ఎందుకు లింక్ పెడతారు? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి చాలా టైముంది. ప్రేమ అనేదానికి నేను ఆమడ దూరం. ఇంకా చాలాకాలం నటించాలని ఉంది’’ అని చెప్పారు. ఇంకా చెబుతూ -‘‘పని తప్ప నాకు వేరే ధ్యాస ఉండదు. షూటింగ్ టైమ్‌లో నా ఆలోచన అంతా పాత్ర మీదే. ఒక్కసారి పేకప్ చెప్పాక ఇక ఎవరితో మాట్లాడను. షూటింగ్ లోకల్లో జరిగితే ఇంటికెళ్లిపోతా. ఇతర ప్రాంతాల్లో అయితే... హోటల్‌కి వెళ్లిపోతా. మరలా బయట కనిపిస్తే షూటింగ్ స్పాట్లోనే. నా లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుంది. నాపై రూమర్లు ఎక్కువగా రాకపోవడానికి కారణం అదే. అలాంటిది ఇప్పుడు ఇలాంటి రూమర్ రావడం బాధగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు కాజల్. -
డిసెంబర్లో నిషా ప్రేమ వివాహం
‘‘ఔను.. నేను ప్రేమలో పడ్డాను. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. వ్యాపారవేత్త’’ అని దాదాపు నాలుగైదు నెలల క్రితం నిషా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన లవ్‌లైఫ్ గురించి ఇతర విశేషాలేమీ అడగొద్దని కూడా తెలిపారు. చివరకు ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల దాకా వెళ్లింది. డిసెంబర్ 28న వివాహ ముహూర్తాన్ని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. వరుడు ముంబయ్‌కి చెందిన వ్యక్తి కాబట్టి, అక్కడే ఈ పెళ్లి జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. నిషా పెళ్లాడబోయే వ్యక్తి పేరు కరణ్ ఉల్లేసా. ‘ఏమైంది ఈ వేళ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిషా ఆ తర్వాత సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో చిత్రాల్లో నటించింది. తను నటించిన ‘డీకే బోస్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిషా చేతిలో సినిమాలు లేవు. పెళ్లి అనంతరం నిషా నటనకు స్వస్తి చెబుతుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు. -
డీకేబోస్ వస్తున్నాడు
సందీప్‌కిషన్ పవర్ఫుల్ పోలీసాఫీ సర్గా నటించిన చిత్రం ‘డీకే బోస్’. ఎన్.బోస్ దర్శకుడు. శేషురెడ్డి, ఆనంద రంగా నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన సినిమా. సందీప్ పాత్ర శక్తిమంతంగా, వినోదాత్మకంగా ఉంటుంది. తప్పకుండా తనను మాస్‌కి చేరువచేసే సినిమా అవుతుంది. యువతరానికి నచ్చే ప్రేమకథ కూడా ఇందులో ఉంటుంది’’ అని తెలిపారు. నిషా అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సంపత్‌కుమార్, బ్రహ్మాజీ, సప్తగిరి, అన్నపూర్ణ, కోట శంకర్రావు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: ప్రసాద్ పెన్మెత్స, కెమెరా: విశ్వేశ్వర్ ఎస్వీ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సహనిర్మాతలు: వెంకటరామరాజు, నజీర్. -
ఎన్.బోస్ దర్శకత్వంలో ‘డీకే బోస్’
‘‘రవితేజ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ తీసిన 12 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మాతగా నేను చేస్తున్న చిత్రమిది. ఆ సినిమా విడుదలైన సెప్టెంబర్ 14నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాం’’ అని శేషురెడ్డి చెప్పారు. ఆయన ఆనంద్రంగాతో కలిసి ఎన్.బోస్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డీకే బోస్’. సందీప్‌కిషన్, నిషా అగర్వాల్ ఇందులో హీరోహీరోయిన్లు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘డబ్బు కోసం ఎలాంటి పనిచేయడానికైనా సిద్ధపడే ఓ పోలీసా ఫీసర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యమే ఈ సినిమా. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వెంకట రామరాజు, నజీర్.