![Kajal Agarwal and Her Sister Shares Two More Wedding Pics - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/2/kajal.jpg.webp?itok=iGtbNf1l)
హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత శుక్రవారం ఎంతో కాలంగా తాను ప్రేమిస్తున్న గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈరోజు మరో రెండు ఫోటోలను కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు.
నిషా షేర్ చేసిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో నవ దంపతులిద్దరు ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్ షేర్ చేసిన ఫొటోలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ మాస్క్ పెట్టుకొని ఉంది. గౌతమ్ కిచ్‌లు వైట్ కలర్ షేర్వాణి ధరించి వైట్ కలర్ మాస్క్ ధరించాడు. ఈ ఫొటోలు చూసిన అభిమానులందరూ కాజల్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని ఫొటోల కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్...
Comments
Please login to add a commentAdd a comment