Wedding pictures
-
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి (ఫొటోలు)
-
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్ వ్యాట్ పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి జార్జీ హోడ్జ్‌ను వివాహమాడింది. ఓల్డ్ టౌన్ హాల్ వీరి పెళ్లి వేడుకకు వేదికైంది.కాగా జార్జీ వ్యాట్ దగ్గర స్పోర్ట్స్ ఏజెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. సౌతాఫ్రికాలో ఎంగేజ్మెంట్ చేసుకుంది.గతేడాది మార్చిలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది డానియెల్ వ్యాట్. తాను జార్జీకి ప్రపోజ్ చేయగా అందుకు తను సానుకూలంగా స్పందించిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ‘‘తను ఎల్లప్పుడూ నాకే సొంతం’’ అంటూ ప్రియురాలిని ముద్దాడిన ఫొటోను షేర్ చేసింది.ఈ క్రమంలో పెళ్లికి సిద్ధమైన వ్యాట్- జార్జీ చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ డానియెల్ వ్యాట్ 2014లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాట్ క్రికెటర్‌గా బిజీగా ఉండగా.. జార్జీ వుమెన్ ఫుట్‌బాల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇక ఇంగ్లండ్ తరఫున డానియెల్ వ్యాట్ రెండు టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20 మ్యాచ్‌లు ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! View this post on Instagram A post shared by Georgie Hodge (@georgiehodge) -
సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
-
Axar Patel Wedding : టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి ఫొటోలు
-
న్యూట్రీషనిష్టుతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పెళ్లి.. వీడియో వైరల్
Axar Patel- Meha Patel Wedding: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను వివాహమాడాడు. వడోదరలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మెహాతో ఏడడుగులు నడిచాడు. గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి నేపథ్యంలో సెలవు తీసుకున్న అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. మెహాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అక్షర్ పటేల్ గతేడాది తన పుట్టినరోజున ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు మెహాను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కాగా మెహా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లికి అక్షర్ స్నేహితుడు, క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ కుటుంబంతో హాజరయ్యాడు. ఇదిలా ఉంటే టీమిండియా మరో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జనవరి 23న బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడిన విషయం తెలిసిందే. మూడు రోజుల(జనవరి 26) తర్వాత అక్షర్ కూడా ఈవిధంగా శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. Axar Patel married to me, took seven rounds with his meha in Vadodara... #axarpatel #mehapatel pic.twitter.com/yimPDvfUaD — Meha Patel (@Meha_Patela) January 27, 2023 Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k — Meha Patel (@Meha_Patela) January 26, 2023 -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ లెహంగాలో పాలక్ మెరిసిపోతుండగా, మిథూన్ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
పెళ్లి ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన హీరోయిన్!
మేజర్, గూఢచారి సినిమాలతో అలరించిన నటి శోభిత ధూళిపాల. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓ వ్యక్తితో చేతిలో చెయ్యేసి పెళ్లి కూతురిలా అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అని క్యాప్షన్ ఇవ్వడంతో నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందా అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇవి పెళ్లికి సంబంధించి ఓ యాడ్ షూట్లో భాగంగా తీసిన ఫోటోలట. ఈ క్రమంలో శోభిత అభిమాని ఒకరు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
మరో రెండు ఫోటోలు, కాజల్ ఫ్యాన్స్‌కు పండగే
హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత శుక్రవారం ఎంతో కాలంగా తాను ప్రేమిస్తున్న గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈరోజు మరో రెండు ఫోటోలను కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. View this post on Instagram As you begin this new journey in life, let it be fantastic, crazy, wonderful, unbelievable and unforgettable. May your life together be full of love and your love full of life. ❤️❤️❤️ @kajalaggarwalofficial @kitchlug #kajgautkitched A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Nov 1, 2020 at 6:34pm PST నిషా షేర్ చేసిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో నవ దంపతులిద్దరు ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్ షేర్ చేసిన ఫొటోలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ మాస్క్ పెట్టుకొని ఉంది. గౌతమ్ కిచ్లు వైట్ కలర్ షేర్వాణి ధరించి వైట్ కలర్ మాస్క్ ధరించాడు. ఈ ఫొటోలు చూసిన అభిమానులందరూ కాజల్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని ఫొటోల కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. View this post on Instagram @manishmalhotraworld @manishmalhotra05 Jewellery : @manishmalhotrajewellery Stylist: @stylebyami Style team : @tanyamehta27 Hair : @divya.naik25 Photo: @storiesbyjosephradhik A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 1, 2020 at 7:23pm PST చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్... -
పెళ్లి ఫొటోలను వేలం వేయనున్న నటి
ఎట్టకేలకు 'అవును.. నేను పెళ్లి చేసుకున్నాను' అంటూ బయటపెట్టిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి ఫొటోలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం సరికొత్తగా ఉంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో తన స్నేహితుడైన జీని గూడెనఫ్ ను ప్రీతి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతి కొద్ మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహ తంతుకు సంబంధించి ఏ ఒక్క ఫొటో కూడా ఇప్పటి వరకు బయటకురాలేదు. మా పెళ్లి ఫొటోలను దయచేసి బయటపెట్టొందంటూ ప్రీతి వివాహానికి హాజరైన అతిథులను కోరినట్లు తెలిసింది. వారి పెళ్లి ఫొటోలను వేలం వేయాలని ప్రీతి దంపతులు ముందే నిర్ణయించుకున్నారట. ఆ వేలం ద్వారా వచ్చే డబ్బును ప్రీతి నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్ధకు అందజేయాలనేది ఈ నూతన వధూవరుల ఆలోచన. అందుకే పెళ్లి ఫొటోలను మీడియాకు చిక్కకుండా ముందు జాగ్రత్త వహించారు ప్రీతి.