పెళ్లి ఫొటోలను వేలం వేయనున్న నటి
ఎట్టకేలకు 'అవును.. నేను పెళ్లి చేసుకున్నాను' అంటూ బయటపెట్టిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి ఫొటోలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం సరికొత్తగా ఉంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో తన స్నేహితుడైన జీని గూడెనఫ్ ను ప్రీతి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతి కొద్ మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహ తంతుకు సంబంధించి ఏ ఒక్క ఫొటో కూడా ఇప్పటి వరకు బయటకురాలేదు.
మా పెళ్లి ఫొటోలను దయచేసి బయటపెట్టొందంటూ ప్రీతి వివాహానికి హాజరైన అతిథులను కోరినట్లు తెలిసింది. వారి పెళ్లి ఫొటోలను వేలం వేయాలని ప్రీతి దంపతులు ముందే నిర్ణయించుకున్నారట. ఆ వేలం ద్వారా వచ్చే డబ్బును ప్రీతి నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్ధకు అందజేయాలనేది ఈ నూతన వధూవరుల ఆలోచన. అందుకే పెళ్లి ఫొటోలను మీడియాకు చిక్కకుండా ముందు జాగ్రత్త వహించారు ప్రీతి.