కోహ్లికి ప్రపోజ్‌ చేసిన క్రికెటర్‌.. ప్రేయసితో ఘనంగా పెళ్లి | England Cricketer Danielle Wyatt Marries Partner Georgie Hodge, Pics Viral | Sakshi
Sakshi News home page

కోహ్లికి ప్రపోజ్‌ చేసిన క్రికెటర్‌.. ప్రేయసితో ఘనంగా పెళ్లి

Published Tue, Jun 11 2024 3:59 PM | Last Updated on Tue, Jun 11 2024 4:11 PM

England Cricketer Danielle Wyatt Marries Partner Georgie Hodge, Pics Viral

ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డానియెల్‌ వ్యాట్‌ పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి జార్జీ హోడ్జ్‌ను వివాహమాడింది. ఓల్డ్‌ టౌన్‌ హాల్‌ వీరి పెళ్లి వేడుకకు వేదికైంది.

కాగా జార్జీ వ్యాట్‌ దగ్గర స్పోర్ట్స్‌ ఏజెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చాలా కాలం పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. సౌతాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది.

గతేడాది మార్చిలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది డానియెల్‌ వ్యాట్‌‌. తాను జార్జీకి ప్రపోజ్‌ చేయగా అందుకు తను సానుకూలంగా స్పందించిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ‘‘తను ఎల్లప్పుడూ నాకే సొంతం’’ అంటూ ప్రియురాలిని ముద్దాడిన ఫొటోను షేర్‌ చేసింది.

ఈ క్రమంలో పెళ్లికి సిద్ధమైన వ్యాట్‌- జార్జీ చెల్సియా ఓల్డ్‌ టౌన్‌ హాల్లో ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇరువురూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ డానియెల్‌ వ్యాట్‌ 2014లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లికి ప్రపోజ్‌ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాట్‌ క్రికెటర్‌గా బిజీగా ఉండగా.. జార్జీ వుమెన్‌ ఫుట్‌బాల్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇక ఇంగ్లండ్‌ తరఫున డానియెల్‌ వ్యాట్‌ రెండు టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20 మ్యాచ్‌లు ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన ఆమె రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement