ఎన్.బోస్ దర్శకత్వంలో ‘డీకే బోస్’ | N Bose directing 'DK BOSE' movie | Sakshi
Sakshi News home page

ఎన్.బోస్ దర్శకత్వంలో ‘డీకే బోస్’

Published Sat, Aug 31 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

ఎన్.బోస్ దర్శకత్వంలో  ‘డీకే బోస్’

ఎన్.బోస్ దర్శకత్వంలో ‘డీకే బోస్’

‘‘రవితేజ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ తీసిన 12 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మాతగా నేను చేస్తున్న చిత్రమిది. ఆ సినిమా విడుదలైన సెప్టెంబర్ 14నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాం’’ అని శేషురెడ్డి చెప్పారు. 
 
ఆయన ఆనంద్‌రంగాతో కలిసి ఎన్.బోస్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డీకే బోస్’. సందీప్‌కిషన్, నిషా అగర్వాల్ ఇందులో హీరోహీరోయిన్లు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘డబ్బు కోసం ఎలాంటి పనిచేయడానికైనా సిద్ధపడే ఓ పోలీసా ఫీసర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. 
 
అప్పుడు అతనిలో జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యమే ఈ సినిమా. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వెంకట రామరాజు, నజీర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement