అక్కలా ఆరబోయలేను | I will not act glamorously the way my sister acts : Nisha Agarwal | Sakshi
Sakshi News home page

అక్కలా ఆరబోయలేను

Published Sun, Aug 24 2014 12:19 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అక్కలా ఆరబోయలేను - Sakshi

అక్కలా ఆరబోయలేను

 అక్క మాదిరిగా అందాలారబోయడం తన వల్ల కాదంటోంది నటి నిషా అగర్వాల్. ఈ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోదరి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్క మాదిరిగానే ఈ అమ్మడు దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా ఎదగాలని ఆశి స్తోంది. నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిం చింది. కోలీవుడ్‌లో ఇష్టం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఈ భామ అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు దాంపత్య జీవితంలో మునిగి తేలింది. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించింది.
 
 పస్తుతం మలయాళంలో భాగ్య భాగ్య అనే చిత్రంలోను తెలుగులో డీకే బోస్ చిత్రంలోను నటిస్తోంది. తమిళంలోను అవకాశాల వేట మొదలెట్టింది. ‘‘మీ అక్క కాజల్ అగర్వాల్ మాదిరి గ్లామరస్‌గా నటిస్తారా?’’ అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ అక్క మాదిరి అందాలారబోత తన వల్ల కా దని ఖరాఖండిగా చెప్పింది. అలాంటి పాత్రలు తన శారీరక భాషకు నప్పవని అంది. నిజం చెప్పాలంటే గ్లామరస్ పాత్రలో నటించడం తనకు సౌకర్యంగా ఉండదని చెప్పింది. అలా అంటే అవకాశాలెలా వస్తాయమ్మా అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి ఈ వివాహిత రీ ఎంట్రీలో ఎలా రాణిస్తుం దో వేచి చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement