పెళ్లి చేసుకుని బిడ్డను కన్న తరువాత కూడా కథానాయకిగా నటించిన అతి కొద్ది మంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలే చేసినా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికిగా రాణించిన నటి కాజల్ అగర్వాల్. ముఖ్యంగా తెలుగు, తమిళ భాష ల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ఇంకా చెప్పాలంటే 2020 అక్టోబర్‌లో ఈ భామ పెళ్లి చాలా గుంభనంగా జరిగింది.
అలాగే పెళ్లయి ఏడాది తిరగకుండానే బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి అయిన కొద్ది రోజులకే మళ్లీ నటించడానికి సిద్ధమైపోయింది. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ సరసన ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ చాలా కసరత్తులనే చేసింది. ముఖ్యంగా గురప్రు స్వారీ, కత్తి సాము, విలు విద్యల్లో తగిన శిక్షణ తీసుకుంది.
లేకపోతే ఈ బ్యూటీ తాజాగా మరో చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఘోస్టీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే ఇందులో కాజల్ అగర్వాల్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం. గ్లామర్‌ను తట్టి లేపే సినీ తారగా, లాఠీని పట్టే పోలీస్ అధికారిగా రెండు వైవిధ్య భరిత పాత్రలను ఇందులో ఆమె పోషించింది. ఇతర ముఖ్యపాత్రలో నటుడు యోగిబాబు, దర్శకుడు కేఎస్.రవికుమార్, రెండిన్ కింగ్ల్సీ, తంగదురై, జగన్ ఊర్వశి, ఆడుగళం నరేన్ మనోబాల, మొట్టై రాజేంద్రన్ తదితరులు నటించారు. దీన్ని సీడ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కాగా ఇందులోని కొన్ని అందమైన ఫొటోలను నటి కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి బ్రహ్మ సృష్టించిన వాటిలో అందం ఒకటి అని పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా వివాహానంతరం కాజల్ అగర్వాల్ నటించి విడుదలకు సిద్ధం అవుతున్న రెండో చిత్రం ఇది.
Comments
Please login to add a commentAdd a comment