అది మాత్రం అడగొద్దు | Kajal Agarwal Will Marry or Not ? | Sakshi
Sakshi News home page

అది మాత్రం అడగొద్దు

Published Tue, Mar 10 2015 12:33 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అది మాత్రం అడగొద్దు - Sakshi

అది మాత్రం అడగొద్దు

 తనను కలిసిన వారిని కాజల్ కోరుతున్న దొక్కటే అది మాత్రం అడగొద్దు అని. ఇంతకీ ఈమె బాధ ఏమిటో చాలామందికి అర్థమయ్యే వుంటుంది. విజయం కోసం తొలి రోజుల్లో పోరాడిన ఈ చందమామ, మగధీర చిత్రంతో తెలుగులోను, తుపాకీ చిత్రంతో తమిళంలోను ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ప్రస్తుతం దక్షిణాదిలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్న ఈ బ్యూటీ నటిగా దశాబ్దం పూర్తి చేసుకుంది. అంతేకాకుండా చెల్లెలు నిషా అగర్వాల్ కొన్ని చిత్రాల్లో నటించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవడంతో అక్క కాజల్ అగర్వాల్ పెళ్లి ఎప్పుడన్న విషయం గురించే అందరూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.
 
 ఇలాంటి ప్రశ్నల పరంపరలతో విసిగిపోయిన కాజల్ ఆ ఒక్కటి అడగొద్దు బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది. దీని గురించి కాజల్ ఏమంటుందో చూద్దాం. కొంతకాలంగా నేను ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న పెళ్లెప్పుడన్నదే. అయినా పెళ్లికి అంత తొందరేముంది. నేనింకా సినిమాను, నటననే ప్రేమిస్తున్నాను. ఇక్కడ సాధించాల్సింది చాలా ఉంది. మరో విషయం ఏమిటంటే నేనిప్పటి వరకు అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోలేదు. వెతుక్కుంటూ వచ్చే అవకాశాల్లోనే నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. పదేళ్లుగా అదే చేస్తున్నాను.
 
 ఎలాంటి పాత్రలు అంగీకరించాలో తెలుసుకునే స్థితికి నేను ఎదిగాననుకుంటున్నాను. అయినా ఇప్పటికీ కెమెరాముందుకు వెళ్లగానే ధ్యానంలోకి వెళ్లిన భావనే కలుగుతుంది. ఇతరుల కంటే నన్ను నేను ప్రత్యేకంగా కూడా ఫీలవుతుంటాను. అదే విధంగా నన్ను అడిగితే ప్రపంచ ంలో అన్నింటికంటే సినిమానే ఉత్తమ వృత్తి అన్నది నా అభిప్రాయం. అంతగా సినిమాను ప్రేమిస్తున్నాను. ఇక పెళ్లి అంటారా సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటున్న కాజల్ ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన మారి చిత్రం, సుశీందర్ దర్శకత్వంలో విశాల్ సరసన నటిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement