
సినిమా ఇండస్ట్రీలో తరుచుగా వినిపించే మాట 'నెపోటిజం'

హీరో తమ్ముళ్లు, హీరోయిన్ చెల్లెళ్లు ఇలా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు

అయితే వీళ్లలో సక్సెస్ అయినోళ్లు తక్కువమంది అనే చెప్పొచ్చు

హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ మాత్రం కాస్త డిఫరెంట్

ఈ రోజు (అక్టోబర్ 18) నిషా అగర్వాల్ పుట్టినరోజు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు నిషా టాలీవుడ్‌లోకి వచ్చింది

2010లో 'ఏమైంది ఈ వేళ', 'సోలో' సినిమాలతో హిట్స్ కొట్టి ఎంట్రీ ఇచ్చింది

కానీ ఏం లాభం కెరీర్‌ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది

ఈ రెండింటి తర్వాత 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' అనే తెలుగు మూవీస్ చేసింది

ఇవి కాకుండా తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు సినిమాలు చేసింది

అలా 2010-14 మధ్య 7 సినిమాలు చేసింది. ఏమైందో ఏమో గానీ పెళ్లి చేసేసుకుంది

ముంబైకి చెందిన కరణ్ వలేచా అనే బిజినెస్‌మ్యాన్‌ని 2013లో పెళ్లి చేసుకుంది

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా పుల్ స్టాప్. 2017లో వీళ్లకు ఓ బాబు పుట్టాడు

స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లి కావడం, అదృష్టం కలిసి రావడం లాంటివి జరిగినా నిషా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది

స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది


