డిసెంబర్‌లో నిషా ప్రేమ వివాహం
‘‘ఔను.. నేను ప్రేమలో పడ్డాను. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. వ్యాపారవేత్త’’ అని దాదాపు నాలుగైదు నెలల క్రితం నిషా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన లవ్‌లైఫ్ గురించి ఇతర విశేషాలేమీ అడగొద్దని కూడా తెలిపారు. చివరకు ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల దాకా వెళ్లింది.
డిసెంబర్ 28న వివాహ ముహూర్తాన్ని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. వరుడు ముంబయ్‌కి చెందిన వ్యక్తి కాబట్టి, అక్కడే ఈ పెళ్లి జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. నిషా పెళ్లాడబోయే వ్యక్తి పేరు కరణ్ ఉల్లేసా.
‘ఏమైంది ఈ వేళ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిషా ఆ తర్వాత సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో చిత్రాల్లో నటించింది. తను నటించిన ‘డీకే బోస్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిషా చేతిలో సినిమాలు లేవు. పెళ్లి అనంతరం నిషా నటనకు స్వస్తి చెబుతుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.