థూ.. థూ ఉమ్ముతో హెయిర్ కటింగ్.. వైరల్‌ వీడియో | Hairstylist Jawed Habib Spitting On Woman Head, Viral Video | Sakshi
Sakshi News home page

మహిళ నెత్తి మీద ఉమ్మివేసి, హెయిర్‌ స్టైల్‌.. తీవ్ర విమర్శలు.. వైరల్‌ వీడియో

Published Thu, Jan 6 2022 7:22 PM | Last Updated on Fri, Jan 7 2022 8:11 AM

Hairstylist Jawed Habib Spitting On Woman Head, Viral Video - Sakshi

లక్నో: ఇండియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన హెయిర్‌ స్టైలిస్ట్‌లలో ఒకరైన జావేద్‌ హబీబ్‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. జావెద్‌ హబీబ్‌ హెయిర్‌ కట్‌ చేస్తూ ఓ మహిళ నెత్తి మీద ఉమ్మివేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో హెయిర్‌ స్టైలిస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జావెద్‌ హబీబ్‌ కొంతమందితో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫనగర్‌లో ట్రైనింగ్‌ సెమినార్‌ నిర్వహించారు. ఇందులో ఓ మహిళను హెయిర్‌ కట్‌ కోసం సెలూన్‌ కూర్చీ వద్దకు పిలిచాడు. దువ్వెనతో జుట్టును సరిచేస్తూ.. సెమినార్‌కు హాజరైన వారికి హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు  ఇంతలోనే ‘ఒకవేళ నీటి కొరత ఉంటే ఉమ్మితోనే గడిపేయాలి..' అంటూ అందరి ముందే ఆయన మహిళ నెత్తి మీద ఉమ్మివేశాడు. దీంతో అక్కడున్న జనమంతా చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు.

అయితే మహిళ జుట్టు చాలా పొడిగా ఉందని చెబుతూ, ఉమ్మిలో ఓ పవర్‌ కూడా ఉందంటూ తను చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకున్నాడు. ఈ వీడియో ఎప్పుడో జరిగిందో క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన క్లిప్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అనేక మంది జావేద్‌ చేసిన అనుచిత పని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు. జావేద్‌ చర్య సెలూన్‌ పరిశ్రమకు అగౌరవమని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ  వీడియోలో తనకు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని షేర్‌ చేసేందుకు సదరు మహిళ ట్విటర్‌లో వీడియోను పోస్టు చేసింది. 
చదవండినోట్లో సిగరెట్‌, చేతిలో గన్‌.. జాంజాం అని బుల్లెట్‌ రైడింగ్‌.. విషయం బయటపడటంతో..

‘నా పేరు పూజాగుప్తా. నేను ఓ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తాను. ఇటీవల జావేద్‌ హబీబ్‌ సార్‌ ఏర్పాటు చేసిన సెమినార్‌కు వెళ్లాను. అతను నన్ను హెయిర్‌ కట్‌ కోసం స్టేజ్‌ మీదకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. మీ దగ్గర నీళ్లు లేనప్పుడు హెయిర్‌ కట్‌కు ఉమ్మి ఉపయోగించవచ్చని చెప్పాడు. కానీ నేను హెయిర్‌ కట్‌ చేయించుకోలేదు. ఒకవేళ నేను మా పక్కింటి మంగళి వ్యక్తి దగ్గర హెయిర్‌ కట్‌ చేయించుకుంటాను. కానీ జావేద్‌ హబీబ్‌ దగ్గరకు వెళ్లను'  అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మహిళా చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ ఉత్తర ప్రదేశ్‌ పోలీసులను కోరారు.
చదవండి: అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement