Javed Habeeb
-
థూ.. థూ ఉమ్ముతో హెయిర్ కటింగ్.. వైరల్ వీడియో
లక్నో: ఇండియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన హెయిర్ స్టైలిస్ట్‌లలో ఒకరైన జావేద్ హబీబ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. జావెద్ హబీబ్ హెయిర్ కట్ చేస్తూ ఓ మహిళ నెత్తి మీద ఉమ్మివేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెయిర్ స్టైలిస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జావెద్ హబీబ్ కొంతమందితో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫనగర్లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కూర్చీ వద్దకు పిలిచాడు. దువ్వెనతో జుట్టును సరిచేస్తూ.. సెమినార్‌కు హాజరైన వారికి హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు ఇంతలోనే ‘ఒకవేళ నీటి కొరత ఉంటే ఉమ్మితోనే గడిపేయాలి..' అంటూ అందరి ముందే ఆయన మహిళ నెత్తి మీద ఉమ్మివేశాడు. దీంతో అక్కడున్న జనమంతా చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు. అయితే మహిళ జుట్టు చాలా పొడిగా ఉందని చెబుతూ, ఉమ్మిలో ఓ పవర్ కూడా ఉందంటూ తను చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకున్నాడు. ఈ వీడియో ఎప్పుడో జరిగిందో క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన క్లిప్ వైరల్‌గా మారడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అనేక మంది జావేద్ చేసిన అనుచిత పని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు. జావేద్ చర్య సెలూన్ పరిశ్రమకు అగౌరవమని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ వీడియోలో తనకు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని షేర్ చేసేందుకు సదరు మహిళ ట్విటర్లో వీడియోను పోస్టు చేసింది. చదవండి: నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో.. This is Javed Habeeb... Spitting instead of using water... absolutely horrible 🤮🤬 pic.twitter.com/8s7xaE8qfO — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 5, 2022 ‘నా పేరు పూజాగుప్తా. నేను ఓ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తాను. ఇటీవల జావేద్ హబీబ్ సార్ ఏర్పాటు చేసిన సెమినార్‌కు వెళ్లాను. అతను నన్ను హెయిర్ కట్ కోసం స్టేజ్ మీదకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. మీ దగ్గర నీళ్లు లేనప్పుడు హెయిర్ కట్కు ఉమ్మి ఉపయోగించవచ్చని చెప్పాడు. కానీ నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. ఒకవేళ నేను మా పక్కింటి మంగళి వ్యక్తి దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటాను. కానీ జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను' అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ ఉత్తర ప్రదేశ్ పోలీసులను కోరారు. చదవండి: అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్ Ms. Pooja's response pic.twitter.com/QKvyoMlCHU — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 6, 2022 -
జగనన్న చేదోడు..ప్రశంసల వర్షం
-
‘జగనన్న చేదోడు’కు జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు') ‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం) తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. -
వివాదంలో చిక్కుకున్న ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్
సాక్షి, లక్నో : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా జావెద్ హబీబ్ తన సెలూన్లలో హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలను, కొన్ని వీడియోలను ఉపయోగింకుంటున్నట్లు వినయ్ పాండే అనే న్యాయవాది మహరాజ్‌గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులకు హెయిర్ స్టయిలిస్ట్‌గా ఉన్న హబీబ్ ప్రచారం కోసం మత విశ్వాసాలను వాడుకుంటున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను జావేద్ దెబ్బతీశాడని వినయ్ పాండే ఆరోపించారు. హిందూ దేవుళ్లు, దేవతలు తన సెలూన్‌కు వచ్చి కస్టమర్ల మాదిరిగా కూర్చున్నట్లు కొన్ని ప్రకటనల్లో చూపాడని ఇవి సోషల్‌మీడియాలోనూ దర్శనమిచ్చాయని లాయర్ వివరించారు. ఈ కేసును ఈనెల 11వ తేదీన న్యాయస్థానం విచారించనుంది. హిందూ దేవతలు, దేవుళ్ల ఫొటోలను తన సెలూన్లో ఉపయోగించడంపై హిందూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా నీవద్ద కటింగ్ చేసుకునేందుకు ఎవరూ రారని కొందరు కామెంట్ చేయగా, మర్యాదగా యాడ్స్‌తో పాటు ఫొటోలను అన్ని తీసేస్తే మంచిదంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.