
రామ్‌చరణ్, ఆలిమ్ హకీమ్, రాజమౌళి
తెరకెక్కించే ప్రతీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలను డిజైన్ చేస్తుంటారు దర్శకుడు రాజమౌళి. దానికి కారణం ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్.. ఇలా అన్నింట్లో రాజమౌళి అండ్ టీమ్ పెట్టే శ్రద్ధ అసమానం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. కియారా అద్వానీ, కీర్తీ సురేశ్ కథానాయికలు. దానయ్య నిర్మాత.
ఈ చిత్రానికి హైయిర్ స్టైలిస్ట్‌గా షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్, హృతిక్ వంటి టాప్ స్టార్స్‌కు పని చేసిన ప్రముఖ బాలీవుడ్ హైయిర్‌స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్‌ని ఎంపిక చేసుకున్నారు రాజమౌళి. ఆల్రెడీ ఆలిమ్‌తో ‘సై, బాహుబలి’ వంటి సినిమాలకు వర్క్ చేశారాయన. తాజా సినిమాలో హీరోల లుక్‌కి సంబంధించి çహకీమ్‌తో మాట్లాడారు రాజమౌళి. ఈ డిస్కషన్ గురించి ఆలిమ్ మాట్లాడుతూ– ‘‘లెజెండ్ రాజమౌళితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. క్యారెక్టర్ గురించి మొత్తం తెలుసుకోకపోతే పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ చేయలేను. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ కలసి పని చేస్తున్నాం. ఈ సినిమా కూడా అలానే ఉండబోతోంది.
రాజమౌళితో పని చేస్తూ చాలా నేర్చుకోవచ్చు. రాజమౌళి, రామ్‌చరణ్‌తో జరిపిన సంభాషణను చాలా ఎంజాయ్ చేశాను. ‘సై’ సినిమాలో నితిన్‌కు హైయిర్ స్టైలింగ్ చేయడం కోసం 15 ఏళ్ల క్రితం రాజమౌళిని తొలిసారి కలిశాను. ప్రతి సినిమాను వైవిధ్యంతో ప్రేక్షకులకు అందించడం ఆయనకు మామూలే. ఇండియన్ సినిమాకు ఆయన గర్వం. రాజమౌళి విజన్‌లో భాగం అవ్వడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ హైయిర్ స్టైల్స్ ఎలా ఉండబోతాయో? అభిమానులు అలానే హెయిర్ కట్ చేసుకొని ఎలా మురిసిపోతారో వేచి చూడాల్సిందే. ఈ చిత్రం 2020లో రిలీజ్ అవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment